News


4 సెషన్లలో 170 శాతం ర్యాలీ.. ఇప్పుడు కొనొచ్చా?

Wednesday 20th November 2019
Markets_main1574242519.png-29734

వీఐఎల్‌ షేరుపై నిపుణుల సూచన
గత నాలుగు సెషన్లులో వొడాఫోన్‌ ఐడియా షేరు దాదాపు 170 శాతం ర్యాలీ జరిపింది. డిసెంబర్‌ 1నుంచి టారిఫ్‌లు పెంచుతామన్న కంపెనీ ప్రకటన షేరుపై ఆసక్తి పెంచింది. వీఐఎల్‌తో పాటు ఎయిర్‌టెల్‌, జియో సైతం రేట్లు పెంచుతామని ప్రకటించాయి. మరోవైపు ఐటీ శాఖ నుంచి కంపెనీకి రూ. 7వేల కోట్లు రావాల్సిఉంది. ఈ రిఫండ్‌ కోరుతూ కంపెనీ ఐటీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. ఒకపక్క కంపెనీ వేల కోట్ల నియంత్రణా జరిమానాలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు టాక్స్‌ రిఫండ్‌ కోరడంపై ఐటీ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఇవన్నీ కంపెనీ షేరుపై మదుపరులకు మక్కువ పెంచింది. దీంతో ఒక్క బుధవారమే షేరు దాదాపు 30 శాతం ర్యాలీ జరిపింది. ఈ నేపథ్యంలో ఇంత ర్యాలీ జరిపిన షేరును మరింత ర్యాలీ ఉంటుందన్న ఆశలతో కొనాలా? విక్రయించాలా? హోల్డ్‌ చేయాలా? అని ఇన్వెస్టర్లు సందేహపడుతున్నారు. మార్కెట్లు టెలికం టారిఫ్‌ల పెంపును ప్రైస్‌ఇన్‌ చేశాయని, అందువల్ల ఇకపై పెద్దగా వీఐఎల్‌లో ర్యాలీ ఉండకపోవచ్చని కొందరు నిపుణుల అంచనా. టారిఫ్‌లతో ఎయిర్‌టెల్‌కు ఎక్కువ లబ్ది చేకూరుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. టెలికంలో ఇప్పటివరకు ఉన్న భారీ నిరాశాపూరిత వాతావరణం స్థానంలో ఆశాజనక పవనాలు కనిపిస్తున్నాయని ట్రేడింగ్‌ బెల్స్‌ అనలిస్టు సంతోష్‌మీనా చెప్పారు. విత్త మంత్రి కామెంట్లు టెలికం షేర్లపై పాజిటివ్‌ అభిప్రాయం పెంచాయన్నారు. టారిఫ్‌ పెంపు ప్రకటన మరింత సానుకూలత తెచ్చిందన్నారు. అయితే ఇవన్నీ అంతిమంగా ఆర్‌ఐఎల్‌కు లబ్ది చేకూర్చవచ్చని అభిప్రాయపడ్డారు. 



You may be interested

ఫార్చ్యున్‌ జాబితాలో సత్యనాదెళ్ల టాప్!

Wednesday 20th November 2019

 భారతి సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ల, ఈ ఏడాది ‘ఫార్చ్యున్స్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితాలో ‍ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈయనతో పాటు భారతీ య సంతతికి చెందిన అజయ్‌ బంగా(మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ), జయశ్రీ ఉల్లాల్‌(ఆరిస్టా హెడ్‌) కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగి, ఆసాధ్యమైన అసమానతలను అధిగమించగలిగి, సృజనాత్మక పరిష్కారాలను కనుగొనే 20 వ్యాపార నాయకులను ఫార్య్చున్‌

2 నెలల గరిష్టానికి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌

Wednesday 20th November 2019

మార్కెట్‌ ప్రారంభం నుంచి ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఫార్మా షేర్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2నెలల గరిష్టాన్ని అందుకుంది. అమెరికా చైనాల మధ్య తొలగని అనిశ్చితి దేశీయ ఫార్మా రంగానికి మరింత డిమాండ్‌ను పెంచుతుందనే విశ్లేషకుల అశావహన అంచనాలు, ఫార్మా కంపెనీల ఆదాయాలపై ప్రభావాన్ని చూపే రూపాయి డాలర్‌

Most from this category