News


ఎస్‌బీఐ షేరును ఏంచేద్దాం?

Tuesday 29th October 2019
Markets_main1572341229.png-29208

బ్రోకరేజ్‌లు, నిపుణుల అంచనాలు, సూచనలు...
సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం వివిధ బ్రోకరేజ్‌లు ఎస్‌బీఐపై బుల్లిష్‌గా మారాయి.

బ్యాంకు షేరుపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి...


1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 390కి పెంచింది. పీఎస్‌యూల్లో ఎంచుకోదగిన షేరు. టెలికం రంగానికి ఎంత రుణాలిచ్చిందనేది ఒక్కటే రిస్కీ అంశం. సేవింగ్స్‌ డిపాజిట్స్‌ వృద్ధి 7 శాతానికి చేరడం విశేషం. క్రెడిట్‌ వ్యయాల కారణంగా ఎర్నింగ్స్‌ అంచనాలు తగ్గించింది.
2. హెచ్‌ఎస్‌బీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 400. స్లిపేజ్‌లు తగ్గడం, ఒత్తిడిలోని ఆస్తులను కట్టడి చేయడం, ప్రొవిజన్స్‌ పెరగకుండా చూడడం, ఎన్‌ఐఎం పెరగడం.. పాజిటివ్‌ అంశాలు. అయితే నిర్వహణ వ్యయాలు పెరిగినందున ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించింది.
3. సిటి: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 375కు తగ్గించింది. ఎన్‌పీఏ రికవరీ, ఎన్‌ఐఎం స్థిరీకరణ మంచి అంశాలు. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ రాబోయే సంవత్సరాలకు లాభాల అంచనాల్లో 18 శాతం కోత విధించింది. 
4. యాంబిట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 338కి పెంచింది. ప్రొవిజన్లు తగ్గడం, ఎన్‌ఐఎం పెరగడంతో ఈపీఎస్‌ అంచనాలను 36 శాతం మేర పెంచింది. 
5. నోమురా: కొనొచ్చు. టార్గెట్‌ను రూ. 400కు తగ్గించింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడడం అనూహ్యమైన పాజిటివ్‌ అంశం. పీపీఓపీ రాబోయే సంవత్సరాల్లో 14 శాతం వార్షిక సగటు వృద్ధి నమోదు చేస్తుంది. 
6. షేర్‌ఖాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 380. క్యాపిటల్‌ అడిక్వసీ బలంగా ఉంది. కార్డుల వ్యాపారంతో కొత్త విలువ జతకలుస్తుంది. 
7. ఎమ్‌కే: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 350. రాబోయే త్రైమాసిక ఫలితాలు చాలా కీలకమైనవి. తమ ఆల్ఫా పోర్టుఫోలియోలో చేర్చింది. 
8. ప్రభుదాస్‌ లీలాధర్‌: కొనొచ్చు. టార్గెట్‌ను రూ. 413కు పెంచింది. తాజా స్లిపేజ్‌లు బాగా దిగివచ్చాయి. బహిర్గత ఇబ్బందులనుంచి తట్టుకునే శక్తి సంపాదించింది. కొత​ ఎన్‌పీఏలు కలవకుండా ఉంటే క్రమంగా ఎర్నింగ్స్‌లో రికవరీ వేగం పుంజుకుంటుంది.
9. మోర్గాన్‌స్టాన్లీ: ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 330. ఫలితాలు బాగున్నా, అవుట్‌లుక్‌ బలహీనంగా ఉంది. క్రెడిట్‌ వ్యయాలు మరికొంత కాలం అధికంగానే ఉండొచ్చు. వాల్యూషన్లు మాత్రం ఆకర్షణీయంగా ఉన్నాయి. 



You may be interested

బుల్స్‌ హల్‌చల్‌ ...సెన్సెక్స్‌ 580 పాయింట్ల ర్యాలీ

Tuesday 29th October 2019

4నెలల గరిష్టం వద్ద ముగిసిన సూచీలు  మెరిసిన మెటల్‌, లాభాల బాటలో అటో షేర్లు నెల గరిష్టానికి నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, నిఫ్టీ​ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌  మార్కెట్లో మంగళవారం బుల్స్‌ హల్‌చల్‌ కొనసాగింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇనెస్టర్లు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ 581.64 పాయింట్లు లాభపడి 39,831.84 వద్ద, నిఫ్టీ 159.70 పాయింట్లు పెరిగి 11,786.85 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఇప్పటివరకు కంపెనీలు ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు

9 ట్రేడింగ్‌ సెషన్లలో యస్‌బ్యాంక్‌ 50 శాతం జంప్‌

Tuesday 29th October 2019

ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 9.50శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో నేటి ఉదయం ఈ షేర్లు రూ.54.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో షేర్లు 9.50శాతం లాభపడి రూ.59.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు యస్‌ బ్యాంక్‌ షేర్లు క్రితం ముగింపు ధర(రూ.54.75)తో పోలిస్తే 7.50శాతం లాభపడి రూ.58.85 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

Most from this category