News


స్వల్పకాలానికి హెచ్‌డీఎఫ్‌సీకి దూరం!

Tuesday 20th August 2019
Markets_main1566294642.png-27899

కోటక్‌ సెక్యూరిటీస్‌ సూచన
వీక్లీ చార్టుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బేరిష్‌ ధోరణి చూపుతోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ చెప్పారు. చార్టుల్లో హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ ప్యాట్రన్‌ ఏర్పడిందని, దీనికితోడు కీలక మద్దతుకు దిగువన క్లోజయిందని చెప్పారు. గతంలో ఆర్‌ఐఎల్‌లో కనిపించిన ధోరణి ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీలో ఉందన్నారు. అందువల్ల స్వల్పకాలానికి ఈ షేరుకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. కొన్ని వారాలపాటు హెచ్‌డీఎఫ్‌సీపై బుల్లిష్‌ కాల్స్‌ను పట్టించుకోవద్దన్నారు. మరో దిగ్గజం ఆర్‌ఐఎల్‌ బేరిష్‌ధోరణి నుంచి వేగంగా రివర్సయిందని, ప్రస్తుతం ఇందులో పాజిటివ్‌ సంకేతాలున్నాయని తెలిపారు. నిఫ్టీ ఐటీ ఇండెక​‍్స బేరిష్‌గా ఉందని, బ్యాంకు నిఫ్టీ రికవరీకి సిద్ధంగా ఉందని అంచనా వేశారు. ప్రధాన సూచీ 11181 పాయింట్లను దాటితే మరింత అప్‌మూవ్‌ ఉంటుందని చెప్పారు. గతవారం ఈ ప్రయత్నం జరిగినా ఫలించలేదన్నారు. ప్రస్తుతం సూచీలో బుల్లిష్‌ ధోరణి ఉందని, అయితే ఇది ప్రస్ఫుటంగా కనిపించాలంటే 11181 పాయింట్లను తప్పకదాటాలని తెలిపారు. ఇదే జరిగితే నిఫ్టీ క్రమంగా 11350- 11450 పాయింట్ల వరకు చేరవచ్చని అంచనా వేశారు. ఒకవేళ ఈ స్థాయిని దాటలేక 10780పాయింట్లను నిలబెట్టుకోలేకపోతే మార్కెట్‌ బాగా నెగిటివ్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. 

 



You may be interested

ఫండ్‌ మేనేజర్లు అధికంగా ‘బై’, ‘సెల్‌’ చేసిన స్టాకులు

Tuesday 20th August 2019

ఈ ఏడాది జులై నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌) నికరంగా రూ. 14,846.75 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. అంతేకాకుండా జులై నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లో జూన్‌ నెలతో పోల్చుకుంటే 6 శాతం పెరిగిందని, జూన్‌ నెలలో ఈ ఇన్‌ఫ్లో రూ. 7,663 కోట్లుండగా, జులై నెలలో రూ. 8,113 కోట్లకు పెరిగిందని వివరించింది. సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఇన్‌ఫ్లో

ఏడాది కనిష్టానికి నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 20th August 2019

ఒడిదుడుకుల మార్కెట్‌లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు మంగళవారం భారీగా పతమమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3శాతం మేర నష్టపోయి ఏడాది కనిష్ట స్థాయిని తాకింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4శాతం క్షీణించగా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ 3.50శాతం నష్టపోయాయి. ఓరియంటల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ 3శాతం నష్టపోయాయి. అలాగే కెనరా బ్యాంక్‌ 2.50శాతం,

Most from this category