News


షార్ట్‌ సెల్లింగ్‌ వల్లే ఇంత నష్టం: దేవేన్‌ ఆర్‌ చోక్సీ

Tuesday 24th March 2020
Markets_main1585072493.png-32655

ప్రస్తుత సంక్షోభం కూడా సమసిపోయేదేనని ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ఎండీ దేవేన్‌ చోక్సీ అన్నారు. కాకపోతే, ప్రస్తుతం చూస్తున్నది అసాధారణ పరిస్థితి అని, ప్రపంచమంతా మూతపడుతుండడాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు. కనుక ఇటువంటి పరిస్థితి మొదటి సారిగా వచ్చిందన్నారు. అయితే, దీన్నుంచి బలంగా బయటకొస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యాపార మూలాలు ఒక పరిమితికి మించి పెద్దగా నష్టపోవన్నారు. అయితే, మన మార్కెట్లు దాదాపు నష్టాన్ని ఇప్పటికే చవిచూశాయన్నారు. ప్రకృత్రిని మనం నియంత్రించలేమని, మన మార్కెట్లను మెరుగ్గా నిర్వహించుకోవచ్చన్నారు. ఒక్కసారి పరిస్థితులు కుదురుకుంటే మార్కెట్లు బలంగా పైకి ఎగుస్తాయన్న విశ్వాసాన్ని చోక్సీ వ్యక్తం చేశారు. 

 

ప్రస్తుతానికి తాము మార్కెట్లలో పూర్తిగా ఇన్వెస్ట్‌ చేసే ఉన్నామని చోక్సీ చెప్పారు. అందుకు విచారించడం లేదని కూడా స్పష్టం చేశారు. తక్కువ స్థాయిల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఇన్వెస్ట్‌ చేసినట్టు చెప్పారు. అయితే, ఇప్పటికీ అతి స్వల్పంగా నగదు నిల్వలు ఉన్నాయని, మార్కెట్లు స్థిరపడిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్‌ చేస్తామని తెలిపారు. అప్పుడు కొంచెం అధిక ధరల్లో ఉన్నా కానీ స్థిరత్వం ముఖ్యమన్నారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో చూస్తున్నంత ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో లేదన్నారు చోక్సీ. కనుక మన దేశంలో 60 శాతం జనాభా ఇప్పటికీ ఈ సంక్షోభం నడుమ సౌకర్యంగానే ఉన్నారని, కనుక ఈ పరిస్థితి సద్దుమణిగితే మార్కెట్లు ర్యాలీ చేస్తాయని అంచనా వేశారు. షార్ట్‌ సెల్లింగ్‌ను సుదీర్ఘకాలంగా అనుమతించడం వల్లే మార్కెట్లలో ఇంత నష్టం చోటు చేసుకుంటున్నట్టు చోక్సీ చెప్పారు. నియంత్రణ సంస్థలు కూడా చర్యలు తీసుకోకపోవడమే ఇంత భారీ నష్టానికి కారణమన్నారు. 

 

ఏదో ఒక సమయంలో మార్కెట్లు తిరిగి బలంగా పైకి వస్తాయన్నారు చోక్సీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లోకి పంప్‌ చేస్తున్న నిధులు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. చమురు ధరలు క్షీణించడం మన ఆర్థిక వ్యవస్థకు మంచి చేస్తుందని చెప్పారు. ప్రైవేటు బ్యాంకుల గురించి మాట్లాడుతూ.. వ్యాపారాల పరంగా పెద్ద నష్టమేమీ జరగలేదన్నారు. బ్యాంకుల్లో నిధుల సమస్య ఉందన్నారు. ఆర్‌బీఐ తన పాత్రను పోషించాలని, బ్యాంకుల్లోకి నిధులు జొప్పించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మంచి బ్యాంకులు త్వరగా కోలుకుంటాయన్నారు.



You may be interested

చమురు ధరల పతనం.. వీటికి లాభం

Tuesday 24th March 2020

కోవిడ్‌ వైరస్‌ కారణంగా చమురుకు డిమాండ్‌ తగ్గింది. మరోవైపు సౌదీ, రష్యాల మధ్య చమురు ఉత్పత్తి కోత విషయమై ఏకాభిప్రాయం రాకపోవడం.. దాంతో సౌదీ అరేబియా ఏకపక్షంగా ధరలను తగ్గించేయడం చూశాం. దీంతో చమురు ధరలు బ్యారెల్‌కు 25 డాలర్ల వరకు ఇటీవల పడిపోయాయి. 2003 ఏప్రిల్‌ తర్వాత ఇంత తక్కువ ధరలను చూడడం మళ్లీ ఇదే మొదటిసారి. ఈ ఏడాది జనవరిలో చూసిన గరిష్ట ధరల నుంచి 65

స్టాక్‌ మార్కెట్‌కు సీతమ్మ భరోసా..!

Tuesday 24th March 2020

అతి త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటన 692 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌ 190 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభంతో ముగిసింది. కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అతి తర్వలో కార్పోరేట్లకు ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. కొన్ని ఫైనాన్షియల్‌ వెసులుబాట్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆమె పేర్కోన్నారు.  దీనికి తోడు ఆర్థిక స్థిరీకరణకు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ హామీతో ఆసియాతో పాటు యూరప్‌

Most from this category