News


రేటింగ్‌ కట్‌.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డౌన్‌

Monday 5th August 2019
Markets_main1565002549.png-27554

విదేశీ బ్రోకరేజీ సంస్థ క్రెడిట్ సూసీ ముఖేష్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు టార్గెట్‌ ధరను 26 శాతం తగ్గించడంతో ఈ కంపెనీ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 3.66 శాతం నష్టపోయి రూ.1,141.00 వద్ద ముగిసింది. ఈ బ్రోకరేజి రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను ‘న్యూట్రల్’ నుంచి ‘అండర్‌పెర్‌ఫార్మ్’ కి తగ్గించింది. అంతేకాకుండా ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ.1,350 నుంచి రూ.995కు తగ్గించింది. ఆర్థిక సంవత్సరం 2021/22లో ఈ కంపెనీ ఈపీఎస్‌(ఒక షేరుపై వచ్చే ఆదాయం) అంచనాలను 5 శాతం తగ్గించింది. క్రెడిట్ సూసీ నిర్దేశించిన టార్గెట్‌ ధర, ప్రస్తుతం ఈ షేరు ధర కంటే 13 శాతం తక్కువగా ఉండడం గమనర్హం. రెండు నెలల క్రితం ఈ కంపెనీ షేరుకు ‘బై’ సిఫార్సు 11 మంది విశ్లేషకులు ఇవ్వగా,  ప్రస్తుతం 9 మందికి పడిపోయారని, హోల్డ్ రేటింగ్‌ను ఇచ్చిన విశ్లేషకులు మాత్రం 9 నుంచి 10 మందికి పెరిగారని రాయిటర్స్‌  వార్తా సంస్థ తెలిపింది. గత ఒక నెలలో ఈ స్టాక్ 9 శాతం పడిపోవడం గమనార్హం. ఈ సంస్థ జూన్ త్రైమాసిక ఫలితాలలో 6.82 శాతం అంటే రూ .10,104 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. టెలికాం యూనిట్ జియో లాభం 45.60 శాతం వృద్ధితో రూ. 891 కోట్లకు పెరగ్గా, రిటైల్ యూనిట్ అమ్మకాలు 47.5 శాతం పెరిగి రూ .38,196 కోట్లకు చేరుకున్నాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 21.25 శాతం పెరిగి రూ .1.61 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో రూ .1.33 లక్షల కోట్లుగా ఈ ఆదాయం ఉంది.



You may be interested

కరెక్షన్‌కు ఈ స్థాయిలో బ్రేక్‌ పడుతుందా..?

Tuesday 6th August 2019

స్టాక్‌ మార్కెట్లు సోమవారం కూడా నష్టాల పాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాలు, వాణిజ్య యుద్ధం విషయమై తాజా ఆందోళనలు అమ్మకాలకు దారితీయడంతో నష్టాలు తప్పలేదు. ఐటీ సూచీ తరహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 1.4 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2 శాతం మేర నష్టపోయాయి. ఈ నేపథ్యంలో స్టాక్‌ సూచీల తదుపరి గమనంపై నిపుణుల విశ్లేషణ పరిశీలిస్తే...   నిఫ్టీ సమీప ట్రెండ్‌ ప్రతికూలంగానే ఉంటుంది. హ్యామర్‌ తరహా

ఇటు కశ్మీర్‌...అటు చైనా..కుప్పకూలిన స్టాక్‌ సూచీలు

Monday 5th August 2019

418 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌  135 పాయింట్లు నష్టపోయి నిఫ్టీ  జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణతో పాటు 35(ఎ) అధికరణ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో పాటు అమెరికా-చైనాల మధ్య ఉధృతమవుతున్న వాణిజ్యయుద్ధ ప్రభావంతో  ప్రపంచ మార్కెట్లు నిలువునా పతనమైన నేపథ్యంలో భారత మార్కెట్‌ సోమవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 418 పాయింట్లను కోల్పోయి 37000 దిగువను 36,699.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 135 పాయింట్లు నష్టపోయి

Most from this category