News


నష్టాల్లోంచి లాభాల్లోకి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు

Friday 15th November 2019
Markets_main1573803656.png-29617

భారతీ ఎయిర్‌ షేరు మిడ్‌సెషన్‌ తిరిగి లాభాల బాట పట్టింది. గురువారం క్యు2 ఫలితాల్లో భారీ నష్టాలు నమోదు చేసిన ఈ షేరు ఉదయం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమైంది. బీఎస్‌ఈలో 2.50శాతం నష్టంతో రూ.357.85 వద్ద ట్రేడ్‌ ప్రారంభమైంది. ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌పై సుప్రీం తీర్పుతో రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.23045 కోట్ల నికర నష్టం వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక నష్టం. దేశ కంపెనీల చరిత్రలో మూడో అతి పెద్ద నష్టం. ఇదే క్వార్టర్‌లో ఇదే టెలికాం రంగానికి వోడాఫోన్‌ ఐడియా కంపెనీ రూ.50922 కోట్ల నికర నష్టాన్ని, 2018 మూడో క్వార్టర్‌లో టాటా మోటర్స్‌ రూ.26,961 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించి మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇదే కాలంలో కంపెనీ పనితీరు బాగుండటంతో ఆదాయం 5శాతం వృద్ధి చెంది రూ.21, 199 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఒక దశలో 2.20శాతం నష్టపోయి రూ. ఇంట్రాడేలో రూ.357.25ల కనిష్టానికి పతనమైంది. అయితే టెలికాం రంగం ఎదుర్కోంటున్న ఈ సమస్యకు కేంద్రం ఖచ్చితంగా రిలీఫ్‌ ప్రకటించే అవకాశం ఉండవచ్చనే అంచనాలతో పాటు అంతర్జాతీయ బ్రోకరేజ్‌  సంస్థ షేరుకు బై రేటింగ్‌ను కేటాయించడం, భారీ పతనం నేపథ్యం ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ పూనుకోవడం తదితర కారణాలతో షేరుకు తిరిగి కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా షేరు కనిష్ట ధర రూ.357.25 నుంచి (రూ.37.35లు) 10.65శాతం పెరిగి రూ.396.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం. 12:00లకు క్రితం ముగింపు(రూ.357.25)తో పోలిస్తే రూ.23.55ల(6.50శాతం) లాభంతో రూ.385.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.254.20లు, రూ.397లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌.... మిట్టల్‌కు లైన్‌ క్లియర్‌!

Friday 15th November 2019

ఎస్సార్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఆర్సెలార్‌ మిట్టల్‌కు శుక్రవారం అనుమతినిచ్చింది. 2018 అక్టోబర్‌ 23న ప్రకటించిన ప్రణాళిక ప్రకారం మిట్టల్‌ డీల్‌పూర్తి చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఈ డీల్‌పై ఉన్న స్టేను ఎత్తేసింది. విక్రయ సొత్తును ఎలా పంచుకోవలన్నది రుణదాతల కమిటీ(సీఓసీ- అంటే బ్యాంకుల కన్సార్టియం) ఇష్టమని తెలిపింది. కంపెనీని విక్రయించిన సొత్తును ఫైనాన్షియల్‌, ఆపరేషనల్‌ క్రెడిటర్లు సమానంగా పంచుకోవాలని గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌పై అనలిస్టుల అంచనాలు

Friday 15th November 2019

నష్టాల్లోంచి లాభాల్లోకి మారిన  షేర్లు ఆరంభ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన వొడాఫోన్‌ ఐడియా, స్వల్పనష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించిన ఎయిర్‌టెల్‌ షేర్లు మధ్యాహ్న సమయానికి దాదాపు 7 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ షేర్లపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. = యూబీఎస్‌: ఎయిర్‌టెల్‌ షేరుకు కొనొచ్చు రేటింగ్‌ను రూ. 415 టార్గెట్‌ను ఇచ్చింది. షేరు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉందని తెలిపింది. ఏజీఆర్‌ లెక్కలు లేకుంటే ఫలితాలు బలంగా ఉన్నట్లేనని

Most from this category