News


భారీ ట్రేడింగ్‌తో ఈ షేర్ల పరుగు

Tuesday 17th March 2020
Markets_main1584434763.png-32533

ఆటుపోట్ల మధ్య లాభాలతో మార్కెట్లు
కొన్ని మిడ్‌క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌

ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. సోమవారం సెన్సెక్స్‌సహా డోజోన్స్‌ వరకూ అమ్మకాల వెల్లువతో కుప్పకూలగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ లాభాలతో కదులుతున్న కారణంగా దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సానుకూలంగా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్న 1.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 254 పాయింట్లు ఎగసి 31,644ను తాకగా.. నిఫ్టీ 76 పాయింట్లు పురోగమించి 9,274 వద్ద ట్రేడవుతోంది. ఇందుకు ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ సైతం దోహదం చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. జాబితాలో అరబిందో ఫార్మా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌,  గుజరాత్‌ అపోలో, బన్నారీ అమ్మన్‌, సెంట్రమ్‌ ఎలక్ట్రానిక్స్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ చోటు చేసుకున్నాయి. వెరసి ఈ కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం పెరగడంతోపాటు.. లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

అరబిందో ఫార్మా: హెల్త్‌కేర రంగ ఈ హైదరాబాద్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 440 వద్ద ట్రేడవుతోంది. మధ్యాహ్నానికల్లా బీఎస్‌ఈలో 1.02 లక్షల షేర్లు ఈ కౌంటర్‌లో చేతులు మారాయి. గత నెల రోజుల్లో సగటున 2.21 లక్షల షేర్ల ట్రేడింగ్‌ పరిమాణం ఈ కౌంటర్లో నమోదైంది. 

ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ఈ ఇండియాబుల్స్‌ గ్రూప్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 162 వద్ద ట్రేడవుతోంది. మధ్యాహ్నానికల్లా బీఎస్‌ఈలో 16.15 లక్షల షేర్లు ఈ కౌంటర్‌లో చేతులు మారాయి. గత నెల రోజుల్లో సగటున 24.17 లక్షల షేర్ల ట్రేడింగ్‌ పరిమాణం ఈ కౌంటర్లో నమోదైంది. 

గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్‌: మైనింగ్‌ పరికరాల తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు లేకపోవడంతో రూ. 118 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1149 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 17,650 షేర్లు చేతులు మారాయి.

సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌: ఈ డైవర్సిఫైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 15 శాతం దూసుకెళ్లి రూ. 262 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 360 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 1,925 షేర్లు చేతులు మారాయి.

కార్పొరేషన్‌ బ్యాంక్‌: ఈ పీఎస్‌యూ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7.5 శాతం పెరిగి రూ. 10.85 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 72,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 79,025 షేర్లు చేతులు మారాయి.

వెల్‌స్పన్‌ ఇండియా: ఈ టెక్స్‌టైల్స్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 15 శాతం పురోగమించి రూ. 31 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.21 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 1.54 లక్షల షేర్లు చేతులు మారాయి.



You may be interested

సన్‌ఫార్మా బైబ్యాక్‌ ధర రూ.425

Tuesday 17th March 2020

రూ.1700 కోట్లతో సొంత ఈక్విటీ షేర్లను కొనుగోలు(బైబ్యాక్‌) చేయనున్నట్లు మంగళవారం సన్‌ ఫార్మా ప్రకటించడంతో ఒక్కసారిగా షేరు విలువ పెరిగింది. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో సన్‌ఫార్మా షేరు 7 శాతం లాభపడింది. బైబ్యాక్‌లో భాగంగా 4 కోట్ల షేర్లను రూ.425 ధర మించకుండా కొనుగోలు చేసేందుకు  సన్‌ఫార్మా కంపెనీ డైరెక్టర్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం ముగింపుతో పోలిస్తే ఈ ధర 15.48 శాతం ఎక్కువ. కాగా ఈ షేర్లు

పతనం కొనసాగితే ప్రమోటర్లకు తిప్పలే..!

Tuesday 17th March 2020

కోవిడ్‌-19 భయాలతో గడచిన రెండు వారాల్లో భారత ఈక్విటీ మార్కెట్‌ భారీ పతనాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 180 స్మాల్‌, మిడ్‌ కంపెనీలకు చెందిన ప్రమోటర్లు తనఖా పెట్టిన మొత్తం షేర్లలో 70శాతం వరకు కోల్పోయే అవకాశం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దలాల్‌ స్ట్రీట్‌లో పతనం ఆగకపోతే కొందరు ప్రమోటర్లు ఏకంగా కంపెనీలో తమ యాజమాన్య హక్కును కోల్పోయి ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.  మార్కెట్‌ పతనంలో భాగంగా షేర్ల

Most from this category