News


ఫైనాన్షియల్‌ అసెట్స్‌ వైపు పెట్టుబడులు

Friday 18th October 2019
Markets_main1571371617.png-28964

  • మొగ్గుచూపుతున్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు
  • కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వ్యక్తిగత ఇన్వెస్టర్లు తమ సంపదను వృద్ధి చేసుకోవడానికి విభిన్న సాధనాల వైపు దృష్టిసారిస్తున్నారు. స్థలాలు, భవనాలు, బంగారం వంటి భౌతిక ఆస్తులకంటే అధికంగా ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా, ప్రావిడెంట్‌ ఫండ్‌, మ్యూచుఫల్‌ ఫండ్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ వంటి ఫైనాన్షియల్‌ అసెట్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ తన ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌-2019లో వెల్లడించింది. భారతీయల మొత్తం వ్యక్తిగత సంపదలో ఫైనాన్షియల్‌ అసెట్స్‌ వాటా గత ఐదేళ్లలో 57.25 నుంచి 60.95 శాతానికి ఎగిసిందని కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ సీఈవో అభిజిత్‌ భవే గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. నివేదిక ప్రకారం.. 2018-19లో ఫైనాన్షియల్‌ అసెట్స్‌లో పెట్టుబడులు 10.96 శాతం వృద్ధితో రూ.2,62,10,624 కోట్లు నమోదు చేశాయి. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ సంఖ్య 2014లో 1,56,000 ఉంటే, గతేడాదికి 2,56,000కు చేరుకున్నారు. 2023-24కు వీరి సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని కార్వీ తన నివేదికలో తెలిపింది.
అగ్రస్థానంలో డైరెక్ట్‌ ఈక్విటీ..
భారతీయుల వ్యక్తిగత సంపద గత ఆర్థిక సంవత్సరంలో 9.62 శాతం అధికమై రూ.4,30,04,855 కోట్లకు ఎగసింది. ఇది ఏటా 13.19 శాతం అధికమై 2023-24 నాటికి రూ.799 లక్షల కోట్లకు ఎగుస్తుంది. ప్రస్తుత వ్యక్తిగత సంపదలో డైరెక్ట్‌ ఈక్విటీ 6.39 శాతం వృద్ధితో తొలి స్థానం కైవసం చేసుకుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా, సేవింగ్‌ బ్యాంక్‌ డిపాజిట్లు, నగదు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2018-19లో డైరెక్ట్‌ ఈక్విటీలో వ్యక్తిగత పెట్టుబడులు రూ.52 లక్షల కోట్లుగా ఉంది. ఇవి 2023-24 నాటికి రూ.136 లక్షల కోట్లకు చేరుకుంటాయని కార్వీ అంచనా వేస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్లు రూ.46 లక్షల కోట్ల నుంచి రూ.80 లక్షల కోట్లకు, బీమా రూ.37 లక్షల కోట్ల నుంచి రూ.72 లక్షల కోట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ.13.7 లక్షల కోట్ల నుంచి రూ.32 లక్షల కోట్లకు, అన్‌లిస్టెడ్‌ ఈక్విటీ రూ.10.5 లక్షల కోట్ల నుంచి 2023-24 నాటికి రూ.37 లక్షల కోట్లకు చేరతాయని కార్వీ చెబుతోంది. 
పెట్టుబడి బంగారమాయే..
ఫిజికల్‌ అసెట్స్‌ 7.59 శాతం అధికమై గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,67,94,231 కోట్లు నమోదైంది. భౌతిక ఆస్తుల్లో బంగారం, రియల్‌ ఎస్టేట్‌ ఏకంగా 92.57 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. ఇక బంగారంలో పెట్టుబడులు 2013-14లో రూ.62 లక్షల కోట్లుంటే, గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇవి రూ.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2023-24 వచ్చేసరికి ఇవి రూ.131 లక్షల కోట్ల స్థాయికి చేరతాయని అంచనా. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు రూ.74 లక్షల కోట్ల నుంచి రూ.118 లక్షల కోట్లకు చేరతాయని కార్వీ నివేదిక వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో తెలంగాణలో 5.65 శాతం తగ్గి రూ.51,904 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 4.32 శాతం అధికమై రూ.15,737 కోట్లుగా ఉంది. జూన్‌లో డిపాజిట్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే తెలంగాణలో 9.67 శాతం వృద్ధితో రూ.4,62,234 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 6.39 శాతం అధికమై రూ.2,99,067 కోట్లు నమోదయ్యాయి. ఇక రెసిడెన్షియల్‌ హౌజింగ్‌ ధరలు హైదరాబాద్‌లో 2015లో 6.18 శాతం పెరిగితే, 2019 వచ్చేసరికి ఏకంగా 21.94 శాతం అధికమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2.23 శాతం, వైజాగ్‌లో 6.63 శాతం వృద్ధి నమోదైంది. 

( కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ సీఈవో అభిజిత్‌ భవే  )



You may be interested

బ్రెక్సిట్ జోష్‌..బలపడిన రూపీ

Friday 18th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో స్వల్పంగా నష్టపోయి 71.19 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. బ్రిటన్‌, ఈయూ(యురొపియన్‌ యూనియన్‌) మధ్య బ్రెక్సిట్‌ ఒప్పందం కుదరడంతో గత షెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేశాయి. అంతేకాకుండా గత కొన్ని సెషన్ల నుంచి విదేశి సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు పెరగడంతో రూపీ డాలర్‌ మారకంలో బలపడుతూ వస్తోంది. బ్రెక్సిట్‌ ఒప్పందం కుదరడం, చమురు ధరలు తగ్గడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌

సత్య నాదెళ్ల ప్యాకేజీ @ రూ. 305 కోట్లు

Friday 18th October 2019

వాషింగ్టన్‌: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. నాదెళ్ల మూలవేతనం సుమారు 2.3 మిలియన్ డాలర్లే అయినప్పటికీ, ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్ డాలర్లు) స్టాక్‌ ఆప్షన్స్‌ కింద లభించింది. 2017-18లో సత్య నాదెళ్ల 25.8 మిలియన్

Most from this category