STOCKS

News


షేర్‌ఖాన్‌ బుల్లిష్‌గా ఉన్న స్టాకులివే!

Tuesday 19th November 2019
Markets_main1574155909.png-29705

‘భారతీ ఎయిర్‌టెల్‌పై టార్గెట్‌ ధరను రూ. 440 కి సవరించాం. వచ్చే రెండేళ్లు భారతీ ఎయిర్‌టెల్‌కు సానుకూలంగా ఉంటాయని అంచనావేస్తున్నాం’ అని షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌
 టెలికాం సెక్టార్‌ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికి, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం గత కొన్ని సెషన్‌ల నుంచి ర్యాలీ చేస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏజీఆర్‌ బకాయిలు చెల్లించడానికి టెలికాం కంపెనీలకు కొంత సమయాన్ని ఇస్తుందనే అంచనాలుండడంతోపాటు, వొడాఫోన్‌-ఐడియా, ఎయిర్‌టెల్‌ కాల్‌ చార్టీలను పెంచుతుండడంతో భారతీ ఎయిర్‌టెల్‌ లాభపడుతోంది. ఎంత మొత్తంలో పెంచుతారనే విషయంపై స్పష్టత లేనప్పటికి చాలా సంవత్సరాల తర్వాత టెలికాం కంపెనీలు చార్జీలను పెంచడం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సంస్థాగత ఇన్వెస్టర్లు ఎయిర్‌టెల్‌ షేర్లను కొనుగోలు చేయడానికి ఉత్సాహం  చూపుతున్నారు. ఈ పరిణామాలన్ని పరిశీలించాక మేము కూడా ఎయిర్‌టెల్‌ టార్గెట్‌ ధరను రూ. 440కు పెంచాం. వచ్చే రెండేళ్ల కాలం భారతీ ఎయిర్‌టెల్‌కు సానుకూలంగా ఉంటుందని అంచనావేస్తున్నాం. 
ఫార్మా రంగంలో ఈ స్టాకులపై బుల్లిష్‌..
యుఎస్‌ వ్యాపారం పుంజుకోవడంతో పాటు, ధరలను నియంత్రించడంతో దేశీయంగా కొన్ని కంపెనీలు లాభపడడంతో ఫార్మా రంగంలో కొన్ని నిర్ధిష్టమైన స్టాకులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రంగంలో సన్‌ ఫార్మా, దివిస్‌ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా వంటి కంపెనీలు వృధ్ది చెందుతున్నాయి. గత కొన్ని సెషన్‌లలో భారీగా పెరిగిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాపై మేము ప్రతికూలంగానే ఉన్నాం. ఈ కంపెనీ రుణాలు అధికంగా ఉండడంతోపాటు, కంపెనీ వృద్ధికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన మార్గదర్శకాలు, కంపెనీ వాస్తవిక వృద్ధి చాలా దూరంగా ఉన్నాయి. ఫార్మా రంగంలో దివిస్‌ ల్యాబ్స్‌ లేదా సిప్లా లేదా బయోకాన్‌పై బుల్లిష్‌గా ఉన్నాం. 
విమాన షేర్లకు దూరం..
విమానయాన రంగంలో రెండుమూడు కంపెనీలే పోటిపడుతున్నప్పటికి, కంపెనీల వృద్ధి మాత్రం ఆశాజనకంగా లేదు. జెట్‌ఎయిర్‌వేస్‌ పోటి నుంచి వైదొలిగాక, మార్కెట్‌ వాటాను ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌లైన్స్‌ అందిపుచ్చుకున్నాయి. కానీ ఇండిగో లేదా స్రైస్‌ జెట్‌ అర్ధవంతమైన ప్రదర్శనను చేయడం లేదు. జెట్‌ఎయిర్‌వేస్‌ మూతపడ్డాక, ఈ రంగంలో ధరలు పెరిగాయి. దీంతోపాటు క్రూడ్‌ ధరలు కూడా మంచి స్థాయిలోనే ఉన్నాయి. ధరలు, క్రూడ్‌ ఆయిల్‌ పరంగా మంచి వాతవారణం ఉన్నప్పటికి ఈ కంపెనీలు మంచి ప్రదర్శనను చేయలేకపోతుంటే, ఈ షేర్లను కొనుగోలు చేయడానికి ఎవరైనా ఎందుకు ప్రయత్నిస్తారు? ఈ కంపెనీల ఎబిటా స్థిరంగా పెరగడంలేదు. ఈ అంశాలే ఎయిర్‌లైన్‌ కంపెనీలకు దూరంగా మమ్మల్ని ఉంచుతోంది. 
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్సర్వ్‌..
ఎన్‌బీఎఫ్‌సీ(బ్యాంకిగేతర ఫైనాన్స్‌ కంపెనీలు) రంగంలోని కొన్ని కంపెనీలకు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌ వృద్ధి రేటు పడిపోయిందనే వాస్తవాన్ని అంగీకరించాలి. కానీ వివిధ బ్యాంకులు(ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు) లేదా ఎన్‌బీఎఫ్‌సీలు డిపాల్ట్‌లను ఎదుర్కొవడం వలన ఈ సెక్టార్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. లైఫ్‌ ఇన్సురెన్స్‌ లేదా జనరల్‌ ఇన్సురెన్స్‌కు చెందిన  కంపెనీల వృద్ధి ఆశాజనకంగా ఉంది. ఈ కంపెనీలు వచ్చే నాలుగు లేదా ఐదేళ్లలో గణనీయమైన లాభాలను ఇవ్వలేనప్పటికి, ఆ తర్వాత వీటీ ఆర్‌ఓఈ గణనీయంగా పెరుగుతుంది. వృద్ధి ఆశాజనకంగా ఉండడంతోపాటు, బలమైన ప్రమోటర్లు ఉండడంతో మేము హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్సర్వ్‌ వంటి కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నాం. You may be interested

ఆప్షన్‌ ట్రేడింగ్‌లో మితేష్‌ సక్సెస్‌ మం‍త్రం!

Tuesday 19th November 2019

ఆరంభ నష్టాల నుంచి అద్భుత లాభాల దిశగా పయనం ఆప్షన్‌ సెల్లింగే కీలకమని సలహా   ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ సూత్రాన్ని కచ్ఛితంగా పాటించి ఆప్షన్‌ ట్రేడింగ్‌లో సక్సెసయిన వ్యక్తి మితేష్‌ పటేల్‌. తన వేతనంతో మార్కెట్లో అనేక ‍ప్రయోగాలు చేసి దశాబ్దకాలం తర్వాత చివరకు సక్సెస్‌ మంత్రాన్ని కనుగొన్నాడు. అసలెవరీ మితేష్‌? ఏం సాధించాడు?.. చూద్దాం.. గుజరాత్‌లోని చిన్న గ్రామంలో జన్మించిన మితేష్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేశాడు. అనంతరం పలు కెమికల్‌ పరిశ్రమల్లో ఉద్యోగాలు

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ జోరు

Tuesday 19th November 2019

ప్రభుత్వరంగ షేర్లు మంగళవారం మార్కెట్‌ ప్రారంభం నుంచి జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 4.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో మొత్తం 12షేర్లు 2శాతం నుంచి 16శాతం వరకు ర్యాలీ చేశాయి. అత్యధికంగా అత్యధికంగా ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ షేరు 16శాతం లాభపడింది. సిండికేట్‌ బ్యాంక్‌ 15శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 10వాతం, యూనియన్‌ బ్యాంక్‌

Most from this category