News


27 శాతం పతనమైన వోడాఫోన్‌-ఐడియా

Monday 29th July 2019
Markets_main1564388200.png-27382

టెలికాం షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ఉన్నాయి.  వోడాఫోన్‌-ఐడియా బలహీన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో ఈ కంపెనీ షేరు విలువ ఉదయం 1.39 సమయానికి 27.03 శాతం నష్టపోయి, రూ. 6.75 వద్ద ట్రేడవుతోంది. టెలికాం షేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ. 4,873 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించగా, కంపెనీ ఆదాయం సైతం 11 శాతం క్షీణించి రూ.11,270 కోట్లకు పడిపోయింది. మిగిలిన వాటిలో టెలికాం ఇండెక్స్‌లో భాగమైన టెలికాం, టవర్‌, కేబుల్‌ కంపెనీలు సైతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్‌ (4.8 శాతం), జీటిపిఎల్ హాత్‌వే (6.37 శాతం), ఆన్‌మొబైల్ గ్లోబల్ (4.49 శాతం) షేర్లు  నష్టపోయాయి. వీటితో పాటు అక్ష్ ఆప్టిఫైబ్రే (4.01 శాతం), టాటా కమ్యూనికేషన్స్ (3.16 శాతం), జిటిఎల్ (3.10 శాతం), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (2.61 శాతం) కూడా నష్టపోయి ట్రేడవుతున్నాయి. ఎస్ అండ్ పి బీఎస్ఇ టెలికాం ఇండెక్స్ మధ్యాహ్నాం 1.35 గంటల సమయంలో 2.71 శాతం నష్టపోయి 921.47 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 219.53 పాయింట్లు తగ్గి 37,665.83 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 95.60 పాయింట్లు తగ్గి 11,188.80 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

టాటామోటర్స్‌ డౌన్‌ 5.5 శాతం

Monday 29th July 2019

దేశీయ వాహన దిగ్గజ కంపెనీ టాటామోటర్స్‌ షేర్లు 5.50శాతం వరకు నష్టపోయాయి. తొలి త్రైమాసికంలో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ప్రకటించకపోవడంతో పాటు నేడు అటో రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు టాటా షేర్ల పతనానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.148.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  శనివారం జరిగిన 36వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త కార్లపై

నిఫ్టీ 100 పాయింట్లు క్రాష్‌

Monday 29th July 2019

364 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో మార్కెట్‌ నష్టాల పరంపర కొనసాగతుంది.  సోమవారం మిడ్‌సెషన్‌ కల్లా సెనెక్స్‌ 300 పాయింట్లను, నిఫ్టీ 100 పాయింట్లను కోల్పోయాయి. అటో, మెటల్‌, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్‌ నష్టాలకు ప్రధాన కారణమవుతోంది. ఇటీవల క్యూ1 ఫలితాలను ప్రకటిస్తున్న దేశీయ కార్పోరేట్‌ కంపెనీల క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల

Most from this category