News


ఏడాది గరిష్ఠానికి 18 షేర్లు

Thursday 4th July 2019
Markets_main1562222934.png-26785

ఎన్‌ఎస్‌ఈ గురువారం(జులై 4) ఇంట్రాడే ట్రేడింగ్‌లో సుమారుగా 18 స్టాకులు తమ ఏడాది గరిష్ఠాన్ని తాకాయి. అదానీ పవర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజస్‌, మంధాన ఇండస్ట్రీస్‌, ఓబెరాయ్‌ రియాల్టి స్టాకులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఆర్‌ఈసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌, సైమెన్స్‌ అండ్‌ టొరంటో పవర్‌ స్టాకులు కూడా తమ 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్‌ 0.26 శాతం లాభపడి 11,947.30 పాయింట్ల వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.21 శాతం లాభపడి 39,921.13 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో  మొత్తంగా 30 షేర్లు లాభాలలో ట్రేడవుతుండగా, 19 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50 లో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడిన వాటిలో ముందుండగా, టాటాస్టీల్‌, టైటాన్‌ కంపెనీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.  



You may be interested

బిర్లా గ్రూప్‌ మూలపురుషుడు ఇకలేరు!

Thursday 4th July 2019

పారిశ్రామిక కురువృద్ధుడు బీకే బిర్లా కన్నుమూత నేడు అంత్యక్రియలు ముంబై: బీకే బిర్లాగా అంతా పిలిచే బసంత్‌ కుమార్‌ బిర్లా ఇక లేరు. బిర్లా గ్రూప్‌ వ్యవస్థాపకుడైన బీకే బిర్లా బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. భారత పారిశ్రామిక రంగానికి పునాదులు వేసిన దిగ్గజాల్లో ఒకరిగా పేర్కొనే బిర్లా గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన 15వ సంవత్సరం నుంచీ ఆయన వ్యాపార కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.

ఇండియా మార్ట్‌ లిస్టింగ్‌ బంపర్‌ హిట్‌

Thursday 4th July 2019

గతవారంలో ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న ఇండియామార్ట్‌ షేర్లు గురువారం ఎక్చ్సేంజీల్లో ఘనంగా లిస్ట్‌ అయ్యాయి. ఐపీఓ ఇష్యూకు అద్భుతమైన స్పందన లభించటం, మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొని ఉండటంతో ఇష్యూ ధర(రూ.973.00)తో పోలిస్తే 21శాతం ప్రీమియంతో రూ.1180.00 వద్ద లిస్ట్‌ అయ్యాయి. బీఎస్‌ఈలోని ఇంట్రాడేలో ఒక దశలో 37.61శాతం వరకు లాభపడి రూ.1339.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:30ని.లకు షేరు ఇష్యూ ధర(రూ.973.00)తో పోలిస్తే 30శాతం

Most from this category