News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Wednesday 26th September 2018
Markets_main1537933191.png-20568

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:53 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 64 పాయింట్ల లాభంతో 11,142 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 11,086 పాయింట్లతో పోలిస్తే 56 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. 

ఆసియా సూచీలు లాభాల్లో..
ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 14 పాయింట్ల లాభంతో 23,954 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 5 పాయిం‍ట్ల లాభంతో 10,984 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 18 పాయింట్ల లాభంతో 3,254 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 37 పాయింట్ల లాభంతో 2,818 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 399 పాయింట్ల లాభంతో 27,898 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇకపోతే దక్షిణ కొరియా మార్కెట్‌కు సెలవు. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి చివరగా శుక్రవారం ట్రేడయ్యింది. అప్పుడు 16 పాయింట్ల లాభంతో 2,339 పాయింట్ల వద్ద ముగిసింది.    

మిశ్రమంగా అమెరికా మార్కెట్లు..
అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.26 శాతం క్షీణతతో 26,492 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.13 శాతం నష్టంతో 2,915 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.18 శాతం లాభంతో 8,007 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడ్‌ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో బ్యాంక్‌లు, యుటిలిటీ, చిప్‌తయారీ కంపెనీలు నష్టపోవడం ఎస్‌అండ్‌పీ 500 క్షీణతకు ప్రధాన కారణం. 



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా?

Wednesday 26th September 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.26 శాతం క్షీణతతో 26,492 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.13 శాతం నష్టంతో 2,915 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.18 శాతం లాభంతో 8,007 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడ్‌ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో బ్యాంక్‌లు, యుటిలిటీ, చిప్‌తయారీ కంపెనీలు నష్టపోవడం ఎస్‌అండ్‌పీ

ఫెడ్‌ రేట్లు పెంచితే మన మార్కెట్లపై పడే ప్రభావం?

Wednesday 26th September 2018

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం తన రేట్ల పెంపుపై ప్రకటన చేయనుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) రెండు రోజుల సమావేశం మంగళవారం మొదలు కాగా, బుధవారంతో ముగుస్తుంది. ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి కనీసం 25 బేసిస్‌ పాయింట్ల పేర రేట్లను పెంచే అవకాశం ఉందని అత్యధికుల అంచనా. ఇదే జరిగితే వడ్డీ రట్లు 1.75-2 శాతం నుంచి 2-2.25 శాతానికి చేరతాయి.    ‘‘ఫెడ్‌ 25 బేసిస్‌ పాయింట్ల

Most from this category