News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు అప్‌

Wednesday 27th February 2019
Markets_main1551236210.png-24345

పాక్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల కారణంగా క్రితం రోజు నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు బుధవారం  పాజిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 గంటలకు 10,860 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,828పాయింట్ల వద్ద ముగిసింది. గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘైలు అరశాతం వరకూ పెరగ్గా. సింగపూర్‌, కొరియా సూచీలు సైతం  స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.  జపాన్‌ నికాయ్‌ ఇండెక్స్‌ అరశాతం పెరిగింది.



You may be interested

సెన్సెక్స్‌ 250, నిఫ్టీ 70 పాయింట్లు అప్‌

Wednesday 27th February 2019

పాక్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల కారణంగా క్రితం రోజు నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు బుధవారం  పాజిటివ్‌గా ప్రారభమయ్యాయి. గత రాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌...వడ్డీ రేట్లపై మెతకవైఖరి అవలంబించనున్నట్లు ప్రకటించడంతో ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ....పాయింట్ల లాభంతో 165 పాయింట్ల లాభంతో 36,123 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44

ఫార్మా రంగంలో ‘స్టార్స్‌’!

Wednesday 27th February 2019

గత రెండు సంవత్సరాలుగా ఫార్మా రంగం షేర్లు (ఒకటి రెండు మినహాయించి) ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలు ఇచ్చింది లేదు. యూఎస్‌ఎఫ్‌డీఏ నియంత్రణ సమస్యలు, అమెరికా మార్కెట్లో జనరిక్‌ ధరల విషయంలో తీవ్ర పోటీ పరిస్థితులు వాటికి ప్రతికూలంగా పనిచేశాయి. కాకపోతే ఈ ధరల ఒత్తిళ్లు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో తిరిగి భారత కంపెనీలు తమ మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. దేశీయ ఫార్మా కంపెనీలకు 2019లో వృద్ధి అవకాశాల

Most from this category