News


 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌

Thursday 27th June 2019
Markets_main1561605891.png-26601

ప్రపంచ మార్కెట్ల సానుకూలత కారణంగా గురువారం భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.45 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,884 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూన్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,864 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రీమియర్‌ జీపింగ్‌ల మధ్య జపాన్‌లో జరగనున్న వాణిజ్య చర్చలు ఫలప్రదం కావచ్చొన్న అంచనాలతో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు పెరిగాయి. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఒక ప్రాధమిక అంగీకారం కుదిరిందని, జపాన్‌లో జరిగే జీ-20 దేశాధ్యక్షుల సదస్సు సందర్భంగా ఈ ఒప్పందంపై ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. ఈ వార్తలతో చైనా షాంఘై ఇండెక్స్‌ 1.5 శాతం జంప్‌చేయగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 1 శాతం, తైవాన్‌ వెయిటెడ్‌ 1 శాతం చొప్పున పెరిగాయి. జపాన్‌ నికాయ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌, కొరియా కోస్పి సూచీలు అరశాతం చొప్పున ఎగిసాయి. 



You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Thursday 27th June 2019

ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో గురువారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 42 పాయింట్ల లాభంతో 39.634 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు జంప్‌చేసి 11,861 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడ్‌ డీల్‌ ఆశలు...ఆసియా మార్కెట్లు అప్‌  ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రీమియర్‌ జీపింగ్‌ల మధ్య జపాన్‌లో జరగనున్న వాణిజ్య చర్చలు ఫలప్రదం కావచ్చొన్న అంచనాలతో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు

బీఎస్‌ఈ 500లో 20 శాతం ఏడాది కనిష్టానికి..!

Thursday 27th June 2019

బెంచ్‌ మార్క్‌ సూచీలు జూన్‌లో నూతన గరిష్టాలను నమోదు చేశాయి. ఆ తర్వాత కొంత దిద్దుబాటుకు గురై మళ్లీ ఎగువవైపు ర్యాలీ మొదలు పెట్టాయి. కానీ, చాలా స్టాక్స్‌ విషయంలో పరిస్థితి మరోలా ఉంది. నిఫ్టీ-50లోనే 22 నుంచి 24 స్టాక్స్‌ వరకు 200 డీఎంఏకు దిగువన ట్రేడ్‌ అవుతుండగా, బీఎస్‌ఈ 500 స్టాక్స్‌లో సుమారు 20 శాతం స్టాక్స్‌ ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. జూన్‌ నెలలో బీఎస్‌ఈ

Most from this category