News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 7th September 2018
Markets_main1536291180.png-20027

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:49 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 15 పాయింట్ల లాభంతో 11,559 పాయింట్ల వద్ద ఉంది. అయితే మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో గురువారం నాటి ముగింపు 11,567 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం నెగటివ్‌గా లేదా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా బుధవారం మిశ్రమంగానే ముగిశాయి.  

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..
ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 224 పాయింట్ల నష్టంతో 22,264 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 31 పాయింట్ల నష్టంతో 26,943 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,280 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 22 పాయింట్ల నష్టంతో 3,126 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 40 పాయిం‍ట్ల నష్టంతో 10,884 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అయితే చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 17 పాయింట్ల లాభంతో 2,708 పాయింట్ల వద్ద ఉంది.    

నాస్‌డాక్‌ డౌన్‌..
అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 20 పాయింట్ల లాభంతో 25,996 పాయింట్ల వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 10 పాయింట్ల క్షీణతతో 2,878 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 72 పాయింట్ల క్షీణతతో 7,922 పాయింట్ల వద్ద ముగిశాయి. సోషల్‌ మీడియా కంపెనీలపై నిబంధనలు కఠినతరం కావడం, టెక్నాలజీ స్టాక్స్‌ పడిపోవడం, చైనా దిగుమతులపై అమెరికా టారిఫ్‌ భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 7th September 2018

నిఫ్టీ గురువారం లాభాల్లోనే ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నాం కల్లా లాభాలన్నీ ఆవిరై, నష్టా‍ల్లోకి వెళ్లింది. రూపాయి 72 స్థాయికి పడిపోవడం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అయితే మళ్లీ చివరి రెండు గంటల్లో ఇండెక్స్‌ పుంజుకొని లాభాల్లో ముగిసింది.  నిఫ్టీ ఇండెక్స్‌ కీలకమైన 11,500 మార్క్‌కు పైన నిలిచింది. డైలీ చార్ట్స్‌లో చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది హ్యామర్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి ఉంది.   నిఫ్టీ-50 గురువారం 11,514 వద్ద

గ్రాఫేన్‌ సెమీకండక్టర్‌ను కొంటున్న ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ

Friday 7th September 2018

ఎల్‌అండ్‌టీ గ్రూపులో భాగమైన ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌... బెంగళూరు కేంద్రంగా నడిచే గ్రాఫేన్‌ సెమీకండక్టర్‌ సర్వీసెస్‌ కంపెనీని కొనుగోలు చేయనుంది. గ్రాఫేన్‌లో 100 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లావాదేవీ ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి పూర్తవుతుందని ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ వెల్లడించింది. కానీ, ఈ కొనుగోలుకు ఎంత వెచ్చించినదీ కంపెనీ వెల్లడించలేదు. గ్రాఫేన్‌ సెమీకండక్టర్‌ సెమీకండక్టర్‌ సేవల్లో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీ.

Most from this category