ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 87 పాయింట్లు డౌన్..!
By Sakshi

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ ఇండెక్స్ బుధవారం తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతోంది. ఈ ఇండెక్స్ నేడు.... కిత్రంరోజు ఇండియాలో ముగిసిన నిఫ్టీ ఫ్యూచర్ ముగింపు(11430)తో పోలిస్తే 17 పాయింట్ల లాభంతో 11447.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకదశలో 22 పాయింట్లు మేర లాభపడి 11452.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఆసియా మార్కెట్లతో పాటు మధ్యాహ్నం యూరప్ మార్కెట్ల బలహీనంగా ప్రారంభం కావడం, అమెరికా ఫ్యూచర్లు నష్టాల ట్రేడింగ్‌తో ఇండెక్స్ నష్టాల బాట పట్టింది. ఇంట్రాడే గరిష్టం(11452)నుంచి 141 పాయింట్ల వరకు నష్టపోయి 11341 స్థాయికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30లకు ఈ ఇండెక్స్...క్రితం రోజు ఇండియాలో నిఫ్టీ ఫ్యూచర్ ముగింపుతో పోలిస్తే 87 పాయింట్ల నష్టంతో 11,343.50 వద్ద ట్రేడ్ అవుతోంది.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు:-
ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలతో ఆసియా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా విడుదల చేసిన తయారీ రంగ గణాంకాలు పదేళ్ల కనిష్టస్థాయిలో నమోదు కావడంతో ఆర్థిక మాంద్య భయాలు మరోసారి ఇన్వెస్టర్లను వెంటాడాయి. జపాన్ ఇండెక్స్ నికాయ్ అరశాతం, సౌత్ కొరియా కొప్పీ 1.50శాతం నష్టపోయాయి. ఆసియా ఆర్థిక హబ్‌గా పిలువబడే హాంగ్‌కాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తడంతో ఆ దేశ ఇండెక్స్ హాంగ్ సెంగ్ అరశాతం క్షీణించింది. చైనా 70వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఆ దేశ మార్కెట్లకు వారం రోజుల పాటు సెలవు రోజులు. సింగపూర్‌కు చెందిన స్టైట్స్ టైమ్స్ ఇండెక్స్ 1.50శాతం నస్టపోయింది.
You may be interested
నష్టాల్లో ముగిసిన ఏడీఆర్‌లు
Wednesday 2nd October 2019అమెరికా మార్కెట్లు నిన్నరాత్రి నష్టాల ముగింపులో అక్కడి మార్కెట్లో ఏడీఆర్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టాటామోటర్స్ ఏడీఆర్, ఇన్ఫోసిస్ ఏడీఆర్, విప్రో ఏడీఆర్, డాక్టర్ రెడ్డీస్ ఏడీఆర్, ఐసీసీఐ బ్యాంక్ ఏడీఆర్‌లు 3.10శాతం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడీఆర్ మాత్రమే స్వల్పంగా లాభపడింది. నిన్న టాటామోటర్స్ విడుదల చేసిన సెప్టెంబర్ మాసపు వాహన గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరుత్సాహపరచడంతో టాటామోటర్స్ ఏడీఆర్ ట్రేడింగ్‌పై ప్రతికూల
నేడు మార్కెట్లకు సెలవు
Wednesday 2nd October 2019మహాత్మగాంధీ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్ ప్రారంభవుతోంది. స్టాక్ మార్కెట్ తిరిగి యథావిధిగా గురువారం (3న) ప్రారంభమవుతుంది. బలహీన ఆర్థిక గణాంకాల నమోదు, సెప్టెంబర్ అటోరంగ షేర్ల విక్రయాలు మార్కెట్ వర్గాలను మెప్పించకపోవడం, పీఎంసీ బ్యాంక్ సంక్షోభ భయాలు, సెప్టెంబర్ తయారీ