News


తీవ్ర హెచ్చుతగ్గులతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 21st October 2019
Markets_main1571633883.png-29027

ఇక్కడ నిఫ్టీ- ఫ్యూచర్స్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ ఇండెక్స్‌ నేడు.... కిత్రంరోజు ముగిసిన నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11670.00)తో పోలిస్తే ఒక దశలో 50 పాయింట్లు లాభపడి 11720.00 స్థాయికి ఎగిసింది. అనంతరం లాభాలను కోల్పోయి నష్టాల్లోకి మళ్లి, 11,652 పాయింట్ల వద్దకు పడిపోయింది.  ఉదయం 10:40 గంటలకు నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపుతో పోలిస్తే 10 పాయింట్ల నష్టంతో 11,660 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్న ఆసియా మార్కెట్లు :- 
‘‘బ్రెగ్జిట్‌’’ అంశంపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. బ్రెగ్జిట్‌ ప్రక్రియకు మరో మూడు నెలల పాటు పొడిగించాలని కోరుతూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదివారం ఐరోపా సమాఖ్యకు లేఖ రాశారు. ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చేందుకు గడువును ఈ నెల 31నుంచి జనవరి 31 వరకు పొడింగిచాలని లేఖలో పేర్కోన్నారు. ఒకవేళ పార్లమెంట్‌ ఆమోదం లభిస్తే ఈ ప్రక్రియ అంతకు ముందే ముగిసే అవకాశం ఉందని బోరిస్‌ లేఖలో పేర్కోన్నారు.  శనివారం నాడు హౌస్‌ఆఫ్‌ కామన్స్‌లో కొనసాగిన హైడ్రామాలో ఎంపీలు బ్రెగ్జిట్‌ గడువును పొడిగించే సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు చేశారు.  బ్రెగ్జిట్‌ అంశంలో ఈ అనిశ్చితి కొనసాగుతున్నా, మరోవైపు అమెరికా- చైనాల వాణిజ్య యుద్ధం సమసిపోయే దిశగా ప్రక్రియ సాగుతుందన్న విశ్వాసంతో నేడు సింగపూర్‌కు చెందిన స్టైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌ ఒకశాతం, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ అరశాతం, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌లు అరశాతం లాభపడ్డాయి. కోప్పీ, జకర్తా ఇండెక్స్‌ 0.10శాతం పెరిగాయి. మరోవైపు చైనాకు చెందిన షాంఘై ఇండెక్స్‌ అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవతోంది. 



You may be interested

తప్పుడు లాభాలు, మార్జిన్‌లు..ఇన్ఫోసిస్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

Monday 21st October 2019

కంపెనీ బోర్డుకు, యుఎస్‌ నియంత్రణ సంస్థకు లేఖ   ఇన్ఫోసిస్‌ స్వల్ప కాలంలో లాభాలు, ఆదాయాలు పెంచుకోడానికి అనైతిక పద్ధతులను అనుసరిస్తోందని, కంపెనీలో ‘నైతికమైన ఉద్యోగులు’గా తమను తాము పిలుచుకునే ఓ గ్రూప్‌, కంపెనీ బోర్డుకు, యుఎస్‌ సెక్యురిటీస్‌, ఎక్సేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ-సెక్‌)కి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ ఆరోపణలను బలపరిచే ఈ మెయిల్స్‌, వాయిస్‌ రికార్డింగులున్నాయని పేర్కొంది. ఇన్ఫోసిస్‌ బోర్డుకు, సెక్‌కు పంపిన లేఖ కాపీలను ఫిర్యాదుదారులు ఆంగ్ల మీడియా ఎకనామిక్‌టైమ్స్‌తో

డిమాండ్‌ ఆందోళనలు.. నష్టాల్లో చమురు

Monday 21st October 2019

   చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతోపాటు, రష్యా సెప్టెంబర్‌ నెలలో నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా అధికంగా చమురును ఉత్పత్తి చేయడంతో చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.25 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.30 శాతం నష్టపోయి బారెల్‌ 59.24 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.15 శాతం నష్టపోయి బ్యారెల్‌ 53.79 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.    ‘చైనా

Most from this category