News


11100ల దిగువుకు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్‌

Saturday 10th August 2019
Markets_main1565426904.png-27685

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 11100ల దిగువన ముగిసింది. సింగపూర్‌లో ట్రేడింగ్‌ ముగిసే సరికి 11,089.50 వద్ద స్థిరపడింది. ఇది(11,089.50) నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11123)తో పోలిస్తే 33.50పాయింట్లు తక్కువ. జాతీయ, అం‍తర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.అమెరికా చైనాల దేశాల మధ్య సెప్టెంబర్‌లో జరగాల్సిన వాణిజ్య పరిష్కార చర్చలు రద్దు అయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేయడంతో రాత్రి అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. అలాగే పలు దేశ సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్ల కోత తగ్గింపునుకు మొగ్గు చూపుతుండం కూడా అక్కడి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ దేశ ప్రధాన ఇండెక్స్‌లైన ఎస్‌అండ్‌పీ 0.66శాతం నష్టపోయి 2.918.76 వద్ద, డౌన్‌జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ 0.34శాతం క్షీణించి 26,287 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 1శాతం పతనమైన 7,959 వద్ద స్థిరపడ్డాయి. 

యూరప్‌ మార్కెట్లు దాదాపు 1శాతం నష్టపోయాయి. ఇటలీ రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో ఇందుకు కారణమయ్యాయి. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 1.11శాతం, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 1.28శాతం, యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ అరశాతం మేర క్షీణించాయి. 

ట్రేడ్‌వార్‌ భయాలతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. తైవాన్‌, కోప్పీ, నికాయ్‌ 225, జకార్త కాంపోసైట్‌  మార్కెట్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. మరోవైపు షాంఘై కాంపోసైట్‌, హాంగ్‌ సాంగ్‌, స్టైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి. 

టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2శాతం పతనం:- అమెరికాలో ట్రేడయ్యే ఇండియన్‌ ఏడీఆర్‌లు దాదాపు 2శాతం నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2శాతం క్షీణించింది. విప్రో ఏడీఆర్‌ 1.50శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1శాతం, ఐసీఐసీఐ ఏడీఆర్‌ 0.75శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 0.11శాతం నష్టపోయాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీఏ ఏడీఆర్‌ 0.25శాతం లాభపడింది. 



You may be interested

ఈవారం మార్కెట్‌ను ప్రభావితం చేసిన 10 స్టాకులు

Saturday 10th August 2019

 ప్రభుత్వం మార్కెట్లకు అనుకూలమైన  చర్యలను చేపట్టనుందనే వార్తల నేపథ్యంలో గురువారం, శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా ముగిశాయి. ఫలితంగా గత నాలుగు వారాల పాటు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈ వారం గణనీయంగా పుంజుకున్నాయి. ఆర్థిక శాఖ అధికారులు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఆందోళనలపై చర్చించేందుకు శుక్రవారం వీరిని కలిశారు. అంతేకాకుండా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ప్రభుత్వం అనేక దశలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడడంతో మార్కెట్లు

1500డాలర్ల పైన ముగిసిన పసిడి ఫ్యూచర్స్‌

Saturday 10th August 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం 1500 డాలర్ల పైన ముగిసింది. అమెరికా మార్కెట్లో నిన్న రాత్రి ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,508.50 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా 3.5శాతం ర్యాలీ చేసిన పసిడి ఫ్యూచర్లు బుధవారం రోజున 1,522.35 వద్ద ఆరేళ్ల గరిష్టస్థాయిని అందుకుంది. వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా డాలర్‌ మారకంలో తన దేశపు కరెన్సీ యువాన్‌ను

Most from this category