News


11000 దిగువుకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Saturday 3rd August 2019
Markets_main1564815373.png-27523

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 11000ల దిగువను ముగిసింది. రాత్రి సింగపూర్‌ మార్కెట్లో 10,976.50 వద్ద స్థిరపడింది. . ఇది నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11024)తో పోలిస్తే 48 పాయింట్ల నష్టంతో ఉందనే విషయాన్ని గమనించాలి. జాతీయ, అం‍తర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికా మరోసారి చైనాపై మరోసారి ట్రేడ్‌వార్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఆసియా మార్కెట్లు మొదలు యూరప్‌, అమెరికా మార్కెట్ల వరకు వారాంతాన్ని నష్టాలతో ముగించాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 300 విలువైన డాలర్ల చైనా దిగుమతులపై 10శాతం మేర పన్ను విధిస్తున్నట్లు గురువారం రాత్రి  ప్రకటించారు. ఈ విధింపు సెప్టెంబర్‌ 1నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చైనాతో జరుగుతున్న వాణిజ్య  చర్చలో భాగంగా అమెరికా ప్రతిపాదించిన అధిక పరిమాణంలో యూఎస్‌ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు చైనా అంగీకరించకపోవడంతో ఇరుదేశాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో ట్రంప్‌ చైనాపై పన్ను విధింపు చర్యలకు పాల్పడ్డారు. అలాగే గతంలో నిలిపివేసిన 250 మిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 25శాతం పన్ను విధింపు తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు ఉన్నధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్‌ చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. 

ఈ అంశానికి తోడు... ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్ల కోత విధింపు మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగా ఉండటంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ దెబ్బతింది. మరికొందరు ఈసారి ఫెడ్‌ రిజర్వ్‌ కోత 50 బేసిస్‌ పాయింట్లు వరకు ఉండవచ్చని అంచనావేశారు. ట్రంప్‌ చైనాపై ట్రేడ్‌వార్‌ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా ఉండేందుకు ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతకు మొగ్గుచూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నిన్న ఆసియాలో ప్రధాన మార్కెట్లు అరశాతం నుంచి 2.50శాతం మేర నష్టపోయాయి. అత్యధికంగా హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. అలాగే జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌, తైవాన్‌ 2శాతం వరకు క్షీణించాయి. చైనా ఇండెక్స్‌ షాంఘై కాంపోజిట్‌ 1.50శాతం నష్టపోగా, కోప్పీ, సెట్‌ కాంపోసైట్‌, స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయాయి. 

యూరప్‌లో ప్రధాన ఇండెక్స్‌లు మూడు 2.50శాతం నుంచి 3శాతం క్షీణించాయి. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 3.50శాతం, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 3శాతం,  యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 2.50శాతం మేర నష్టపోయాయి.

అమెరికా ప్రధాన సూచీలైన డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ 98 పాయింట్లు నష్టపోయి 26,485, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 0.7శాతం క్షీణించి 2,932.05 వద్ద, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 1.3శాతం పతనమై 8,004.07 వద్ద స్థిరపడ్డాయి.



You may be interested

స్పందన స్ఫూర్తి రూ.360కోట్ల నిధుల సమీకరణ

Saturday 3rd August 2019

యాంక‌ర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపుల ద్వారా రూ.360.28 కోట్లను స‌మీక‌రించిన‌ట్లు స్పందన స్ఫూర్తి కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 42లక్షల ఈక్విటీ షేర్లను అప్పర్‌ ప్రైజ్‌ బాండ్‌ రూ.856 వద్ద కేటాయింపు ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. వెల్స్‌ ఫార్గో ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఈక్వటీ ఫండ్స్‌, ఫ్లోరిడా రిటైర్‌మెంట్‌ సిస్టమ్స్‌, బజాజ్‌ అలియన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సహా మరో 15 యాంకర్‌ ఇన్వెస్టింగ్‌

ఫ్రంట్‌లైన్ స్టాక్‌లే బెటర్‌ ఛాయిస్‌!

Saturday 3rd August 2019

దీర్ఘకాలానికి బీమా, సిటీ గ్యాస్‌ డిస్ట్రీబ్యూషన్‌ సెక్టార్స్‌..  హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ కవలలు దిద్దుబాటుకు గురైతే వాటిని కొనుగోలు చేయవచ్చు ‘చాలా పెద్ద క్యాప్‌లు నెమ్మదిగా మిడ్‌క్యాప్‌లుగా మారుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఫ్రంట్‌లైన్ స్టాక్‌లకు కట్టుబడి ఉండడమే ఉత్తమం. మిడ్‌ క్యాప్‌లపై బుల్లిష్‌గా ఉంటే వీటిపై దృష్ఠి పెట్టవచ్చు.’ అని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , రీసెర్చ్ హెడ్ జగన్నాధం తునుగుంట్ల ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.

Most from this category