News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌!

Saturday 29th February 2020
Markets_main1582958527.png-32184

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపు( 11149.15)తో పోలిస్తే 75.85 పాయింట్లు పెరిగి 11149.15 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈసారి వడ్డీరేట్ల తగ్గింపు యోచనలో ఉన్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను బలపరించింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా సూచీలు 3శాతం కనిష్టస్థాయి నుంచి రివకరీ అయ్యాయి. 

ఇక దేశీయ మార్కెట్ల విషయానికొస్తే... ప్రస్తుతమున్న ఆర్థిక మందగమనం కోవిడ్‌ వైరస్‌ కారణంగా మాంద్యంగా పరణమిస్తుందనే భయాలతో శుక్రవారం సెన్సెక్స్‌  1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 3.64 శాతం, నిఫ్టీ 3.71 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనం. 

ఆరు రోజుల్లో రూ.12 లక్షల కోట్లు ఆవిరి:
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.45 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.5.45,453 కోట్లు క్షీణించి రూ.1.46,94,572 కోట్లకు పడిపోయింది. గత ఆరు రోజుల్లో మొత్తం రూ.11,76,986 కోట్ల సంపద హరించుకుపోయింది.

7.50శాతం నష్టపోయిన వేదాంత ఏడీఆర్‌: 
అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు అన్ని నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా వేదాంత ఏడీఆర్‌ 7.50శాతం నష్టాన్ని చవిచూసింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 5.76శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 5శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 4.50శాతం, విప్రో ఏడీఆర్‌ 3శాతం, ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1.50శాతం నష్టపోయాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ మాత్రం స్వల్పంగా 0.25శాతం పతనమైంది. 



You may be interested

భద్రమైన బంగారం ఎందుకు పడిపోయింది?

Saturday 29th February 2020

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ మార్కెట్‌లన్నీ కుప్పకూలినప్పటికీ, మార్జిన్‌ కాల్స్‌ పెరగడంతో బంగారం ధర పడిపోయింది. అయితే ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే బంగారం ధరలు కూడా దిగిరావడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం ఒక్కరోజే  3 శాతంపైన బంగారం ధర పడిపోయింది.అమెరికా మార్కెట్‌లో 2008లో ఒక వారంలో ఆయిల్‌ ధరలు పడిపోయినట్లుగా ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుతున్నాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 57.50 (3.5%)డాలర్లు పడిపోయి

పావెల్‌ వ్యాఖ్యలతో యూఎస్‌ సూచీల పతనానికి బ్రేక్‌!

Saturday 29th February 2020

వరుసగా ఏడోరోజూ నష్టాల్లో ముగిసిన ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌  2008 తర్వాత ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నాస్‌డాక్‌, డౌజోన్స్‌ అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టవచ్చనే భయాలతో ఈ దేశ స్టాక్‌ సూచీలు శుక్రవారం నష్టంతో ముగిశాయి. సూచీలకు ఇది వరుసగా ఏడో రోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. కరోనా వైరస్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఇలాగే కొనసాగితే ఈసారి వడ్డీరేట్ల

Most from this category