News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20పాయింట్లు అప్‌

Saturday 7th December 2019
Markets_main1575701603.png-30108

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి లాభంతో 11,975.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11955.70 పాయింట్లతో పోలిస్తే 20 పాయింట్ల లాభంతో ఉంది.  నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ లాభంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక నిన్నటి రోజున సూచీలు వరుసగా రెండో నష్టాలపాలయ్యాయి. ఆర్థిక వృద్ధి భయాలు వెంటాడటం, రిజర్వ్‌బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం లాంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఆర్థిక, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లు మార్కెట్‌ ప్రారంభం నుంచి నెలకొనడంతోస సెన్సెక్స్‌ 334 పాయింట్లు నష్టంతో 40, 455 వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 11, 921 వద్ద ముగిశాయి. ఈ వారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్‌ 346.66 పాయింట్లు, నిఫ్టీ 134.55 పాయింట్లు చొ‍ప్పున నష్టాలను నమోదు చేశాయి. 
ఫెడ్‌ పాలసీ, ఆర్థిక గణాంకాలు కీలకం:-
అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం, దేశీయ ఆర్థిక గణాంకాలు వచ్చే వారంలో మార్కెట్‌కు దిశానిర్దేశం కానున్నాయి. నవంబర్‌ నెలకు సంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలు, అక్టోబర్‌ నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదలు కానున్నాయి. ఈ గణాంకాలు దేశీయ ఆర్థిక వ్యవస్థ పనితీరను ప్రతిబింబిచనున్న నేపథ్యంలో మార్కెట్‌ వర్గాలు ఈ గణాంకాలపై దృష్టిని సారించాయి.  అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పరపతి సమీక్ష సమావేశాలు మంగళ, బుధవారాల్లో(డిసెంబర్‌ 10, 11తేదీల్లో) జరగునున్నాయి. రెండు రోజుల సమావేశం అనంతరం బుధవారం 11న పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఈసారి కూడా ఫెడ్‌ వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నవంబర్‌లో అంచనాలకు మించి ఉద్యోగాల కల్పన జరగడంతో ఫెడ్‌వడ్డీరేట్ల తగ్గింపుపై నీళ్లు చల్లినట్లయ్యింది. మరోవైపు పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌) ముడి చమురు ఉత్పత్తిని మరింతగా తగ్గించాలని నిర్ణంచింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రోజుకు 5,00,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత పడనుంది. ఒపెక్‌ నిర్ణయంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌ లాంటి దేశాలపై ఇది ఆర్థిక భారంగా మారునుంది. వీటితో పాటు అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్‌ తదితర అంశాలు మార్కెట్‌ గమనాన్ని ప్రభావితం చేయగలవు. 



You may be interested

2020 డిసెంబర్‌ కల్లా సెన్సెక్స్‌ 45,500

Saturday 7th December 2019

వచ్చే ఏడాది డిసెంబర్‌ చివరినాటికి నిఫ్టీ 13, 400 స్థాయిని నమోదు చేస్తుందని కోటక్‌ సెక్యూరిటీ అంచనా వేస్తుంది. సెన్సెక్స్‌ సైతం 45,500 స్థాయిని అందుకోగలదని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. ‘‘నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని కార్పొరేట్ల లాభాలు ఆర్థిక సంవత్సరం 2019-20లో 10శాతం, ఆర్థిక సంవత్సరం 2020-21లో 27శాతం చొప్పున పెరుగుతాయి. గడిచిన మూడేళ్లలో నిఫ్టీ-50 సీఏజీఆర్‌ 8శాతంగా నమోదైన నేపథ్యంలో వచ్చే మూడేళ్ల కాలానికి సీఏజీఆర్‌ 18శాతం వృద్ధిని ఆశిస్తున్నాము.’’

పసిడి 18డాలర్ల పతనం

Saturday 7th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 18డాలర్లు నష్టపోయింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడం పసిడి పతనానికి కారణమైంది. నిన్నరాత్రి అమెరికా నవంబర్‌ మాసపు ఉద్యోగ గణాంకాలు విడుదల చేసింది. ఈ నవంబర్‌లో 1.8లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరగవచ్చని విశ్లేషకలు అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి 2.6లక్షల కొత్త ఉద్యోగ సృష్టి జరిగింది. ఈ ఏడాది జనవరి తరువాత అత్యధికంగా ఉద్యోగ కల్పన జరగడం ఇదే తొలిసారి.

Most from this category