News


స్వల్ప నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 5th June 2019
Markets_main1559710030.png-26098

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ బుధవారం స్వల్ప నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ట్రేడింగ్‌లో 4 పాయింట్లు తగ్గిన 12,052.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 12056.15 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్లు తక్కువ. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు సైతం లాభాల్లో ముగిశాయి.
మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు:- 
అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత ఏడీఆర్‌లు మంగళవారం మిశ్రమంగా ముగిసాయి. ఐటీ రంగ ఏడీఆర్‌లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.25శాతం పెరగ్గా, విప్రో ఏడీఆర్‌ 1శాతం ర్యాలీ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1శాతం లాభంతో ముగిసింది. ఇక టాటామోటర్స్‌ ఏలాంటి లాభనష్టం లేకుండా అక్కడిక్కడే స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ అరశాతం, డాక్టర్‌ రెడ్డీస్ ఏడీఆర్‌ 1శాతం చొప్పున నష్టపోయాయి. 



You may be interested

లాభాల్లో ఆసియా మార్కెట్లు

Wednesday 5th June 2019

అమెరికా మార్కెట్ల నుంచి లాభాల ముగింపు అందుకున్న ఆసియా మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మొగ్గుచూపడంతో పాటు,  డాలర్‌ ఇండెక్స్‌ 7వారాల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225 ఇండెక్స్‌ 2శాతం లాభపడగా, చైనా షాంఘై కాంపోజిట్‌ సూచి అరశాతం పెరిగింది. వాటితో పాటు సింగపూర్‌ స్రైట్‌

నేడు మార్కెట్‌కు సెలవు

Wednesday 5th June 2019

 రంజాన్‌ పండుగ సందర్భంగా బుధవారం మార్కెట్‌ సెలవు. ప్రధాన ఎక్చ్సేంజీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌లతో పాటు కమోడిటీ, బులియన్‌, మెటల్‌ మార్కెట్‌ పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లకు కూడా నేడు సెలవు దినం. తిరిగి మార్కెట్లు గురువారం(జూన్‌ 06) ప్రారంభం కానున్నాయి. నిన్నటి రోజు మార్కెట్‌ నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌ 184 పాయింట్లు నష్టపోయి 40,083 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లను నష్టపోయి 12,021 వద్ద స్థిరపడ్డాయి. రేపు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లపై

Most from this category