News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌?..నిఫ్టీ అవరోధాలు 12046, 12,100

Wednesday 19th February 2020
Markets_main1582082416.png-31912

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 56 పాయింట్లు ప్లస్‌
 మంగళవారం యూఎస్‌ మార్కెట్లు డీలా

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా(గ్యాపప్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం  8.30 ప్రాంతం‍లో 69 పాయింట్లు పుంజుకుని 12,075 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,006 పాయింట్ల  వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాలో ఉత్పత్తి, అమ్మకాలు మందగించడంతో జనవరి-మార్చి త్రైమాసికంలో పనితీరు నీరసించనున్నట్లు ఐపోన్ల దిగ్గజం యాపిల్‌ తాజాగా అంచనాలు ప్రకటించడంతో మంగళవారం అమెరికా మార్కెట్లు వెనకడుగు వేశాయి. యాపిల్‌ షేరు 2 శాతం క్షీణించి 319 డాలర్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 315 డాలర్ల దిగువకూ చేరింది. యాపిల్‌ గైడెన్స్‌ దేశీయంగానూ ప్రభావం చూపింది. దీంతో మంగళవారం వరుసగా నాలుగో రోజు మార్కెట్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 161  పాయింట్లు క్షీణించి 40,894 వద్ద నిలవగా.. నిఫ్టీ 53 పాయింట్లు తక్కువగా 11,992 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్ల స్థాయిల దిగువన ముగిశాయి.కాగా.. వరుసగా నాలుగు రోజుల నష్టపోయిన మార్కెట్లలో నేడు ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో నేడు దేశీయంగా మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావవచ్చని అంచనా వేస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,923 పాయింట్ల వద్ద, తదుపరి 11,854 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు   భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,046 వద్ద, ఆపై 12,100 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక   బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 30,312 పాయింట్ల వద్ద, తదుపరి 30,062 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత   30,753 పాయింట్ల వద్ద, తదుపరి 31,943 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాల వైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 74 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 309 కోట్లు విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. సోమవారం సైతం​ఎఫ్‌పీఐలు రూ. 374 కోట్లు, డీఐఐలు రూ. 154 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.



You may be interested

కేసీపీ గ్రూపు అధినేత వీఎల్‌ దత్‌ కన్నుమూత

Wednesday 19th February 2020

కొరుక్కుపేట (చెన్నై, సాక్షి): తెలుగు వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ వీఎల్‌ దత్‌ (82) గుండె పోటు కారణంగా మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు సతీమణి డాక్టర్‌ వీఎల్‌ ఇందిరాదత్‌, కుమార్తె కవితా దత్‌ ఉన్నారు. 1937 డిసెంబర్‌ 27న జన్మించిన వెలగపూడి లక్ష్మణదత్‌ (వీఎల్‌దత్‌) లండన్‌లోని బిజినెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. కేసీపీ గ్రూపు సిమెంట్‌, చక్కెర తదితర రంగాల్లో

యాపిల్‌కు ‘‘వైరస్‌’’

Wednesday 19th February 2020

చైనాలో తగ్గిన తయారీ, డిమాండ్‌  ఆదాయ అంచనాలు అందుకోలేం  వెల్లడించిన యాపిల్‌ కంపెనీ  శాన్‌ఫ్రాన్సిస్కో/క్యూపర్టినో:  కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ ప్రభావం ఆపిల్‌ కంపెనీపై పడింది. ఈ మార్చి క్వార్టర్‌లో ఆదాయ అంచనాలను అందుకోలేమని ఐఫోన్స్‌ తయారు చేసే యాపిల్‌ కంపెనీ సోమవారం వెల్లడించింది. ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా చైనాలో ఐఫోన్‌ల తయారీ దెబ్బతిన్నదని, ఫలితంగా తగిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌లను సరఫరా చేయలేమని తెలిపింది. అంతేకాకుండా చైనాలో యాపిల్‌ స్టోర్స్‌ను కొన్ని రోజులు మూసేశామని,

Most from this category