News


మళ్లీ సానుకూల ఓపెనింగ్‌ నేడు!

Friday 27th March 2020
Markets_main1585278629.png-32698

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 67 పాయింట్లు ప్లస్‌
ఆసియా మార్కెట్లు 1-3 శాతం ప్లస్‌
గురువారం అమెరికా మార్కెట్లు జూమ్‌

నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.15 ప్రాంతం‍లో  67 పాయింట్లు పుంజుకుని 8,754 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఏప్రిల్‌ ఫ్యూచర్‌ 8,687 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు వీలుగా రూ. 1.7 లక్షల కోట్ల ప్రణాళికను ప్రకటించగా.. నేడు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఉదయం 10 గంటలకల్లా విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు.  ఆర్‌బీఐ నిర్ణయాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావచ్చని అంచనా వేస్తున్నారు. వెరసి ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు సానుకూలంగా కదిలే వీలున్నట్లు భావిస్తున్నారు.

మూడో రోజూ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు బుధవారం జోరు చూపాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇండెక్సులు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్‌  1411 పాయింట్లు దూసుకెళ్లి 29,947 వద్ద నిలవగా.. నిఫ్టీ 324 పాయింట్లు జంప్‌చేసింది. 8,641 వద్ద ముగిసింది.  ఇక మరోపక్క యూఎస్‌ మార్కెట్లు సైతం 6.5 శాతం స్థాయిలో ఎగశాయి.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 8381 పాయింట్ల వద్ద, తదుపరి 8121 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు   భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 8,825 పాయింట్ల వద్ద, ఆపై 9,009 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు.  ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 18,516 పాయింట్ల వద్ద, తదుపరి 17,418 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత  20,561 పాయింట్ల వద్ద, తదుపరి 21,507 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

విక్రయాల బాటలోనే
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 485 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు)  రూ. 770 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.  ఇక బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1893 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.., దేశీ ఫండ్స్  రూ. 738 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2153 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  దేశీ ఫండ్స్‌ రూ. 1554 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

టీవీలు, ఫ్రిజ్‌లకు ‘‘వైరస్‌’’...!

Friday 27th March 2020

గత ఏడాది పుంజుకున్న అమ్మకాలు  ఈ ఏడాది అమ్మకాలకు కరోనా గ్రహణం  పెరిగిన పన్నులు  సరఫరా చెయిన్‌లో సమస్యలు  కుదేలైన డిమాండ్‌  ప్రతికూలతలున్నా, ధరలు పెంచాల్సిన పరిస్థితి  రెండేళ్ల అంతంత మాత్రం అమ్మకాల నుంచి ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌, టీవీ వంటి వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాల కంపెనీలు  గత ఏడాది కోలుకున్నాయి. గత ఏడాది ఈ వస్తువుల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఈ జోష్‌తో ఈ ఏడాది అమ్మకాలు మరింత మెరుగ్గా ఉండగలవన్న ఆశలను కోవిడ్‌-19(కరోనా) వైరస్‌

మల్టీ బ్యాగర్ల వేటలో రిటైల్‌ ఇన్వెస్టర్లు

Friday 27th March 2020

మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ ఏమున్నాయి..? అంటూ గూగుల్‌ సెర్చ్‌ బార్‌లో వెతుకుతున్నారా..? గూగుల్‌ ట్రెండ్స్‌ను గమనిస్తే.. మల్టీబ్యాగర్ల కోసం అన్వేషణ తారా స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్లు కరెక్షన్‌కు గురైన సందర్భాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. మల్టీబ్యాగర్ల కోసం అన్వేషణ గరిష్ట స్థాయికి చేరడం చివరిగా 2019 ఏప్రిల్‌లో జరిగింది. అప్పుడు మార్కెట్లు పతన బాటలోనే ఉన్నాయి. నిఫ్టీ 11856 పాయింట్ల నుంచి 11,108 పాయింట్లకు నాడు క్షీణించింది. కొన్న ధర

Most from this category