News


మార్కెట్లలో నేడు మళ్లీ మహా పతనం?

Friday 13th March 2020
Markets_main1584069795.png-32450

భారీ గ్యాప్‌ డౌన్‌తో ఓపెనింగ్‌ నేడు!
ప్రపంచ మార్కెట్లలో కరోనా సునామీ
588 పాయింట్లు కుప్పకూలిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 
యూరప్‌, యూఎస్‌ మార్కెట్లు 12-10 శాతం డౌన్‌
13 ఏళ్లలో అత్యధిక పతనం
ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల వెల్లువ
40 నెలల కనిష్టానికి జపాన్‌- నికాయ్‌ 10 శాతం డౌన్‌

నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి పతనం(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 588 పాయింట్లు పడిపోయి 8,892 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 9,580 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను పుట్టి ముంచుతున్న కరోనా స్టాక్‌ మార్కెట్లలో నష్టాల సునామీ సృష్టిస్తోంది. యూరోపియన్‌ దేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలపై నిషేధానికితోడు, ఇదే బాటలో పలు దేశాలు రాకపోకలను బంద్‌ చేయడంతో సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ బేర్‌ గుప్పెట్లో ఇరుక్కున్నట్లు తెలియజేశారు. వెరసి గురువారం ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల వెల్లువతో వణికి పోయాయి. అమెరికాలో డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 10 శాతం పతనంకాగా.. యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే మరింత అధికంగా 12 శాతం కుప్పకూలాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. జపనీస్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 10 శాతం పడిపోయింది. 40 నెలల కనిష్టాన్ని తాకింది. వెరసి పతనంలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. ఇక గురువారం దేశీయంగానూ పతనంలో సరికొత్త రికార్డ్‌ నమోదైన సంగతి తెలిసిందే. మార్కెట్‌ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్‌ దాదాపు 3,000 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ సైతం 870 పాయింట్లు పడిపోయింది. వెరసి సెన్సెక్స్‌ 33,000 పాయింట్ల దిగువన 32,778 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 10,000 పాయింట్ల మైలురాయిని కోల్పోయి 9,590 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లకు సోకిన అమ్మకాల ఫీవర్‌ నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లను మరోసారి వణికించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 9,385 పాయింట్ల వద్ద, తదుపరి 9,180 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 9,918 పాయింట్ల వద్ద, ఆపై 10,246 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని  తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,264 పాయింట్ల వద్ద, తదుపరి 22,557 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా  బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 24,951 పాయింట్ల వద్ద, తదుపరి 25,930 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3475 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 3918 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3515 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2835 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ.  6,596 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ  ఫండ్స్‌ రూ. 4,975 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  You may be interested

నిఫ్టీ 10శాతం‍ క్రాష్‌... ట్రేడింగ్‌ నిలిపివేత..!

Friday 13th March 2020

45నిమిషాల​తరువాత ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభం ప్రపంచఈక్విటీ మార్కెట్లలో అల్లకల్లోం సృష్టించిన కోవిద్‌-19 వ్యాధి శుక్రవారం భారత్‌ మార్కెట్‌ను కబళించింది. కోవిద్‌-19 వ్యాధి దెబ్బకు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ నిలిచిపోయింది. మార్కెట్‌ ప్రారంభమైన 6నిమిషాలకే ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు 10శాతం నష్టాన్ని చవిచూడటంతో ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ఎక్చ్సేంజీలు ప్రకటించాయి. సెన్సెక్స్‌ 9.50శాతం నష్టాన్ని చవిచూసి 29687.52 వద్ద,  నిఫ్టీ 10శాతం క్షీణించి 8624.05 వద్ద నిలిచిపోయాయి. ట్రేడింగ్‌ తిరిగి 45నిమిషాల

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు పెట్టుబడుల వరద

Friday 13th March 2020

ఫిబ్రవరిలో 1,483 కోట్లు రాక న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం రావచ్చన్న భయాలు బంగారాన్ని ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు బంగారం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఫలితమే ఫిబ్రవరి నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి భారీగా రూ.1,483 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బంగారం ఈటీఎఫ్‌ల్లోకి వరుసగా పెట్టుబడులు రావడం ఇలా నాలుగో నెలలోనూ కొనసాగింది. ఈ ఏడాది జనవరిలో రూ.202 కోట్లు, 2019 డిసెంబర్‌లో

Most from this category