News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 5th July 2019
Markets_main1562296200.png-26806

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న శుక్రవారం భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.35 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 17 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,997 పాయింట్ల వద్ద కదులుతోంది. గురువారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,980 పాయింట్ల వద్ద ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రతిపాదనల్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక క్రితం రోజు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్కడి మార్కెట్లకు సెలవు. తాజాగా ఆసియా స్టాక్‌ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 



You may be interested

68.59 వద్ద రూపీ ప్రారంభం

Friday 5th July 2019

డాలర్‌ మారకంలో రూపీ శుక్రవారం ట్రేడింగ్‌లో(జులై 5) ట్రేడింగ్‌లో 0.31 శాతం బలహీన పడి 68.59 వద్ద ప్రారంభమైంది. ఈ రోజు  బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో గత సెషన్‌లో దేశియ మార్కెట్లు సానుకూలంగా ముగియడంతో పాటు చమురు ధరలు పడిపోవడంతో డాలర్‌ మారకంలో రూపీ బలపడింది. ప్రభుత్వం బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచుతుందా?లేదా? అనే అంశంపై మదుపర్లు దృష్ఠి పెట్టనున్నారని మోతిలాల్‌ ఓస్వాల్‌ అన్నారు. ఈ రోజు డాలర్‌ మారకంలో

బడ్జెట్‌ గురించి పది విశేషాలు

Thursday 4th July 2019

మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే బడ్జెట్‌కు విశేష ప్రాధాన్యం ఉంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అన్ని వర్గాల జీవితాలను బడ్జెట్‌లోని కేటాయింపులు, నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. అందుకే బడ్జెట్‌ను ఎక్కువ మంది ఆసక్తిగా పరిశీలిస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి బడ్జెట్‌ను, కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు తొలి బడ్జెట్‌ అవుతుంది. ఈ సందర్భంగా బడ్జెట్‌ గురించి కొన్ని

Most from this category