News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు డౌన్‌

Monday 8th July 2019
Markets_main1562556020.png-26873

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరుత్సాహానికి తోడు...ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా  పోమవారం భారత్‌ మార్కెట్‌ నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.50 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,770 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,820 పాయింట్ల వద్ద ముగిసింది.

ఆసియా సూచీల పతనం..

అమెరికా జాబ్స్‌ డేటా గత శుక్రవారం పాజిటివ్‌గా వెలువడటంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మొదలైన నేపథ్యంలో తాజాగా ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. చైనా షాంఘై సూచి 2 శాతం పతనంకాగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1.8 శాతం, కొరియా కోస్పి 1.5 శాతం, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌ 1.3 శాతం, జపాన్‌ నికాయ్‌ 1 శాతం చొప్పున నష్టాలతో ట్రేడవుతున్నాయి. 

 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 8th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  మైండ్‌ ట్రీ:- కంపెనీ సీఈవో, మేనిజింగ్‌ పదవికి డైరెక్టర్‌ పదవికి కె.నటరాజన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి రోస్ట్నో రవణన్‌ రాజీనామా చేశారు.  అధునిక్‌ ఇండస్ట్రీస్‌:- నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి మహేష్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. సిమైన్స్‌:- గుజరాత్‌లోని హలోల్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియా పరిసర ప్రాంతంలోని తన భూభాగాన్ని ఎల్‌ఎం విండ్‌ పవర్‌ బ్లేడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు  రూ.158కోట్లకు విక్రయించింది. టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌:-

సెన్సెక్స్‌ స్టాక్స్‌లో అనుకూలం - ప్రతికూలం

Sunday 7th July 2019

కన్జ్యూమర్‌, కన్‌స్ట్రక్షన్‌ స్టాక్స్‌ మధ్య కాలానికి మంచి లాభాలను ఇస్తాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు కేంద్రం పెద్ద పీట వేయడం, గ్రామీణుల ఆదాయం పెంపు చర్యలు ఇందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌ సూచీలోని స్టాక్స్‌కు సంబంధించి బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం ఏ మేరకు అన్నది ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలియజేసింది.    డెకరేటివ్‌ పెయింట్స్‌ విభాగంలో మార్కెట్‌ లీడర్‌. 50 శాతం వాటా ఈ కంపెనీదే.

Most from this category