News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 300 పాయింట్లు అప్‌

Monday 20th May 2019
Markets_main1558321781.png-25829

క్రితం రోజు రాత్రి వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌....తిరిగి ఎన్‌డీఏ అధికారం చేపట్టనున్నట్లు సూచించడంతో సోమవారం భారత్‌ మార్కెట్‌ భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40 గంటలకు  303  పాయింట్ల లాభంతో 11,727 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,424 పాయింట్ల వద్ద ముగిసింది. వివిధ ఏజెన్సీలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం ఎన్‌డీఏకు గరిష్టంగా 355 లోక్‌సభ స్థానాలు, కనిష్టంగా 267 స్థానాలు రావొచ్చని అంచనావేశాయి. లోక్‌సభలో మెజారిటీ సాధించాలంటే 273  స్థానాలు అవసరం. ఎన్‌డీఏకు అనుకూలంగా వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పెద్ద ర్యాలీ జరిపింది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో  తాజాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.  జపాన్‌ నికాయ్‌, కొరియా కోస్పి, తైవాన్‌ వెయిటెడ్‌ సూచీలు లాభాలతోనూ, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘై, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌ సూచీలు నష్టాలతోనూ ట్రేడవుతున్నాయి.  



You may be interested

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 20th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ తరుపున స్వతంత్ర్వ డైరెక్టర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న రాబిన్‌ కామర్క్‌ రాజీనామా చేశారు.  ఆల్కేమ్‌ ల్యాబ్స్‌:- ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని బద్ధీ యూనిట్‌లో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్వహణ లోపాలను గుర్తించి 4 అబ్జర్వేషన్ల జారీ చేసింది. టీఆర్‌ఎఫ్‌:- తన అనుబంధ సంస్థలో రూ.167 కోట్లకు సమానమైన వాటాలను విక్రయించింది.  టొరెంటో ఫార్మా:- రూ.100 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను

ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ షాపింగ్‌ వీటిల్లోనే...

Monday 20th May 2019

ఐసీఐసీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థ) దేశంలో రెండో అతిపెద్ద ఏఎంసీ. ఏప్రిల్‌ నెలలో ఈ సంస్థ పెట్టుబడులను  ఓ సారి గమనించినట్టయితే...    వొడాఫోన్‌ ఐడియా, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, అవంతి ఫీడ్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌బీసీసీ తదితర షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటాలు పెంచుకుంది. ‘‘మార్కెట్లు ప్రస్తుతం మంచి సహేతుక స్థాయిల్లో ఉన్నాయి. ఈ తరహా మార్కెట్‌ పరిస్థితుల్లో స్టాక్‌ వారీ విధానాన్ని అనుసరించాల్సి

Most from this category