News


ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 4th April 2019
Markets_main1554347819.png-24964

 క్రితం రోజు రికార్డుస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనై క్షీణతతో ముగిసిన భారత్‌ సూచీలు...గురువారం  ఫ్లాట్‌గా ప్రారంమయ్యే సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పనష్టంతో ట్రేడవుతోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 3 పాయింట్ల నష్టంతో 11,726 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,729 పాయింట్ల వద్ద ముగిసింది.  క్రితం రోజు రాత్రి అమెరికా సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఆసియా సూచీల్లో హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ అరశాతం నష్టంతో ట్రేడవుతుండగా, చైనా షాంఘై,  సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌, జపాన్‌ నికాయ్‌, తైవాన్‌ వెయిటెడ్‌ సూచీలు స్వల్ప లాభాలతోనూ ట్రేడవుతున్నాయి.



You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 4th April 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా గురువారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు నేడు ఆర్‌బీఐ పాలసీ ప్రకటన కారణంగా రియల్టీ, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ షేర్లు వెలుగులో వుంటాయి. కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌:- ఈ కంపెనీ కాఫీడే కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో రూ. 26 కోట్లు పెట్టుబడి చేసింది. కోస్టల్‌ కార్పొరేషన్‌ :- ఈ కంపెనీ సెబి వద్దనున్న కేసును పరిష్కరించకుంది. ఇండోరామా సింథటిక్స్‌:- ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన రూ. 298 కోట్ల విలువైన 8.3 కోట్ల ఈక్విటీ షేర్లను  ఇండోరామా నెదర్లాండ్స్‌బీవీకి ప్లేస్‌చేసింది.  గృహ్‌ ఫైనాన్స్‌- బంధన్‌బ్యాంక్‌లో విలీనానికి సంబంధించి స్టాక్‌

టాటా మోటార్స్‌ ర్యాలీ... ఎంత వరకు?!

Thursday 4th April 2019

టాటా మోటార్స్‌ స్టాక్‌ ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటి వరకు 27 శాతం పెరిగింది. నిఫ్టీ-50లో బాగా పెరిగిన టాప్‌ 5 స్టాక్స్‌లో ఇదీ ఒకటి. ఈ నెల 2న కీలకమైన సైకలాజికల్‌ స్థాయి రూ.200ను అధిగమించి పైన క్లోజయింది. 2018 నవంబర్‌ తర్వాత ఈ స్థాయిని దాటడం మళ్లీ ఇదే. మార్చి త్రైమాసికం ఎర్నింగ్స్‌ మెరుగుపడొచ్చని, కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహాలు మెరుగుపడొచ్చని కంపెనీ అంచనాలు ప్రకటించింది. దీంతో

Most from this category