ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 40 పాయింట్లు అప్
By Sakshi

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్ సోమవారం అరశాతం మేర లాభపడింది. ఎస్‌జీఎక్స్ ఇండెక్స్ నిఫ్టీ ఫ్యూచర్ ఆదివారంనాటి మూరత్ ట్రేడింగ్ ముగింపు(11625)తో పోలిస్తే బాగా పెరిగింది. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న మొదటి దశ వాణిజ్య చర్చల ఒప్పందం దాదాపు కుదిరినట్లే అనే వార్తలు శుక్రవారం వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. నేడు ఆసియా మార్కెట్లు 3నెలల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ సంకేతాన్ని అందిపుచ్చుకున్న ఎస్జీఎస్ నిఫ్టీ ఇండెక్స్...క్రితం రోజు నిఫ్టీ ఫ్యూచర్ ముగింపు(11625)తో పోలిస్తే 55 పాయింట్లు ర్యాలీ చేసి 11680.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:00లకు నిఫ్టీ ఫ్యూచర్ ముగింపుతో పోలిస్తే 40 పాయింట్లు లాభంతో 11,665 వద్ద ట్రేడ్ అవుతోంది.
3నెలల గరిష్టస్థాయిలో ఆసియా మార్కెట్లు:-
చైనాతో వాణిజ్య చర్చల్లోరెండువారాల క్రితం అమెరికా ప్రతిపాదించిన ''ఫేజ్-1'' వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు ప్రకటించడంతో నేడు ఆసియా మార్కెట్లు 3నెలల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఒప్పందంలోని కొన్ని అంశాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. అయితే డిప్యూటి స్థాయి చర్చల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపింది. వచ్చేనెల చిలీలో జరిగే సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కలిసి ట్రంప్ ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తారని అని అమెరికా వాణిజ్య ప్రతినిధి శుక్రవారం తెలిపింది. అలాగే అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ వాణిజ్య వివాదాల కారణంగా ఆర్థిక మందగమన సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వారంలో ఫెడ్ రిజర్వ్‌తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) సైతం వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. ఫలితంగా ఆసియాలో చైనాకు చెందిన షాంఘై ఇండెక్స్, జపాన్ ఇండెక్స్ నికాయ్, హాంగ్‌కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్, కోప్పీ, జకర్తా ఇండెక్స్‌లు అరశాతం నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి.
You may be interested
ఎస్బీఐ, ఐసీఐసీఐ మొండి బకాయిలు తగ్గాయ్...కానీ!
Monday 28th October 2019దేశీయ బ్యాంకుల్లో టాప్ బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి ఫలితాలు నమోదు చేశాయి. ముఖ్యంగా మొండిపద్దుల పెరుగుదలతో క్షీణత రెండు బ్యాంకుల ఫలితాల్లో కనిపించింది. అయితే మందగమన ప్రభావం ఇంకా ఉందని, ఆస్తుల నాణ్యత పరంగా బడా అకౌంట్ల పరిష్కారం జరగాల్సిఉందని ఇరు బ్యాంకుల చీఫ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా మొండిపద్దులు దాదాపుగా తగ్గాయని ఐసీఐసీఐబ్యాంకు తెలిపింది. దీనివల్లనే ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించిందని
ఫెడ్ పాలసీ నిర్ణయం, కార్పొరేట్ ఫలితాలే కీలకం..!
Monday 28th October 2019ఇన్ఫోసిస్ వివాదం, బ్రెగ్జిట్ ఆందోళనలు, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, టెలికాం ఏజీఆర్‌పై సుప్రీం కోర్టు తీర్పు, కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరుత్సాహపరచడంతో గతవారం స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. అయితే, క్యూ2లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత పెరగడంతో ఆయా బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరావడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్‌కు కొంత మద్దతుగా నిలిచాయి. దీపావళి సందర్భంగా