News


లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 1st June 2019
Markets_main1559374638.png-26040

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతానికి పైగా లాభపడింది. సింగపూర్‌లో శుక్రవారం రాత్రి 58.00 పాయింట్లు పెరిగి 11,983 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు  శుక్రవారం ముగింపు 11916.50తో పోలిస్తే 67 పాయింట్ల లాభంతో ఉంది. ఇక శుక్రవారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ప్రతికూల అంతర్జాతీయ అంశాలకు తోడు కొత్త కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ నియమాకం మార్కెట్‌ వర్గాలను విస్మయపరచడం ఇందుకు కారణమయ్యాయి. అలాగే మార్కెట్‌ ముగింపు తరువాత జీడీపీ, మౌలిక రంగ, ద్రవ్యలోటు గణాంకాలు విడుదల కానున్న నేపధ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. నిన్న ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 39,374.24 - 40,122.34(746 పాయింట్లు) రేంజ్‌లో, నిఫ్టీ 11,829.45 - 12,039.25 (296 పాయింట్లు) శ్రేణిలో కదలాడింది. ఈ వారం మొత్తంలో చూసినట్లైతే సూచీలు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ 279 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ 79 పాయింట్ల పెరిగింది. మార్కెట్లో రాజకీయపరమైన సందిగ్ధత తొలగింది. ఇక ఇన్వెస్టర్లు వచ్చేవారంలో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంపై దృష్టి సారించనున్నారు. 



You may be interested

1300 డాలర్లపైన ముగిసిన పసిడి

Saturday 1st June 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల పైన ముగిసింది. అమెరికాలో శుక్రవారం రాత్రి ఏకంగా 18.70 డాలర్లు లాభపడింది. వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మరో దేశంపై వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వారు. అమెరికా దక్షిణ సరిహద్దు దేశమైన మెక్సికో దిగుమతులపై 5శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 10 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తున్నట్లు

ఆర్‌కామ్‌ బకాయిలు @ రూ.49,193 కోట్లు

Saturday 1st June 2019

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) కంపెనీ రూ.49,193 కోట్లు చెల్లించాలని రుణదాతలు పేర్కొ‍‍న్నారు. ఈ బకాయిల్లో అధిక భాగం రుణాలు చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఇచ్చినవే ఉన్నాయి. అయితే ఆర్‌కామ్‌ రూ.47,039 కోట్ల మేర రుణాలు చెల్లించాల్సి ఉందని ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌(ఐఆర్‌పీ) పర్దీప్‌ కుమార్‌ సేథీ పేర్కొన్నారు. మిగిలిన బకాయిలను నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు.  ఆర్‌కామ్‌ తమకు చెల్లించాల్సిన రుణాలంటూ రుణ దాతలు ఒక

Most from this category