News


స్వల్ప నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 27th July 2019
Markets_main1564215487.png-27360

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. రాత్రి సింగపూర్‌ మార్కెట్లో 11,314.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11327)తో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో ఉందనే విషయాన్ని గమనించాలి. జాతీయ, అం‍తర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఫ్లాట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావారణం నెలకొంది. వారాంతాన్ని ఆసియా మార్కెట్లు నష్టాలతో యూరప్‌, అమెరికా మార్కెట్లు లాభాలతో ముగించాయి. 

నిన్న అసియాలో ప్రధాన మార్కెట్లన్నీ అరశాతానికి పైగా నష్టపోయాయి. అ‍త్యధికంగా జకర్తా కాంపోసైట్‌ శాతానికి పైగా నష్టపోయింది. సింగపూర్‌ ఇండెక్స్‌ 0.75శాతం, కోప్సీ, తైవాన్‌, హాంగ్‌ సెంగ్‌, స్టెరిలైట్‌ టైమ్స్‌, నికాయ్‌ ఇండెక్స్‌లు 0.50శాతం నుంచి 0.65శాతం క్షీణించాయి. 

యూరప్‌ మార్కెట్లలో ఎఫ్‌టీఎస్‌సీ 0.80శాతం, సీఏసీ ఇండెక్స్‌, డాక్స్‌ ఇండెక్స్‌లు అరశాతం లాభపడ్డాయి. 

టెక్‌ కంపెనీల క్యూ2 ఫలితాలు అంచానాలకు మించి నమోదు కావడంతో పాటు క్యూ2 ఫలితాలు అంచనాలను మించి నమోదుకావడంతో రాత్రి అమెరికా సూచీలు లాభాల్లో ముగిశాయి. సూచీల్లో ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ కాంపోజిట్‌లు ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఈ క్యూ2లో గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ అమ్మకాలు 12శాతం పెరిగాయి. రెవెన్యూ గతేడాది క్యూ2లో 30.84 బిలియన్‌ డాలర్లను ఆర్జించగా ఈ క్యూ2లో 31.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అలాగే కంపెనీ 25 బిలియన్‌ డాలర్ల షేర్ల బైబ్యాక్‌ ఇష్యూకు ప్రకటించింది. మరో టెక్‌ దిగ్గజం ట్విటర్‌ క్యూ1 అమ్మకాలు సైతం 11శాతం పెరిగాయి. అలాగే ఇదే క్యూ2లో విశ్లేషకులు 829 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేయగా, 841 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. జీడీపీ గణాంకాలు అంచనాలకు అందుకోవడంతో వచ్చే వారంలో వడ్డీరేట్ల కోత అంచనాలు మరింత పెరిగాయి. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ రెండునెలల గరిష్టానికి చేరుకోవడం సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్  0.19శాతం పెరిగి 27,192 ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 0.74శాతం లాభపడి 3025.86 వద్ద, నాస్‌డాక్‌ 1.11శాతం పాయింట్లను ఆర్జించి 8,330 వద్ద స్థిరపడ్డాయి. 



You may be interested

క్యూ1లో అంచనాలను అందుకోని హావెల్స్‌

Saturday 27th July 2019

ఎలక్ట్రిక్‌ పరికరాల తయారీ సంస్థ హావెల్స్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్యూ1లో కంపెనీ రూ.177.09 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్యూ1లో నికర లాభం రూ.211.2 కోట్లుగా నమోదైంది. విశ్లేషకులు మాత్రం ఈ క్యూ1లో రూ.240 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశారు. ఇదే క్వార్టర్‌ కాలానికి రూ.2,960 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, 4.5శాతం స్వల్ప వృద్ధిని

‘ఇ’ వాహనాలపై పన్ను..12% నుంచి 5% నికి

Saturday 27th July 2019

జీఎస్టీ రేటును తగ్గించిన జీఎస్టీ మండలీ  ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ)పై జీఎస్‌టీ రేటును  12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ శనివారం నిర్ణయించింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ల వాహనాల చార్జర్లపై ఉన్న 18 శాతం జీఎస్‌టీ రేటు 5 శాతానికి తగ్గించింది. ఇవి 2019 అగష్టు 01 నుంచి అమలులోకి రానున్నాయి. స్థానిక ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ బస్సులను నియమించుకుంటే వాటిని జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇవ్వడానికి జీఎస్‌టీ కౌన్సిల్‌ ఒప్పుకుంది.

Most from this category