News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 75 పాయింట్లు క్రాష్‌..!

Friday 21st February 2020
Markets_main1582263912.png-31982

ప్రపంచ ఈక్వీటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్‌లో  75 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. నిన్నటి నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపు(12079.00)తో పోలిస్తే 75 పాయింట్లను కోల్పోయి 12,004.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో అంతర్జాతీయ వృద్ధి మందగమనం భయాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు ఇంట్రాడేలో 1శాతం నష్టపోగా, నేడు ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. చైనాలోని వాణిజ్య ప్రధాన కేంద్రాలైన గువాంగ్‌డాంగ్, జియాంగ్‌సు ప్రాంతాల్లో కార్యక్రమాల పునఃప్రారంభం వేగవంతమైనట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించడంతో ఆ దేశ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. చైనా తరువాత కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావం అత్యధికంగా ఉన్న దక్షిణ కొరియా ఇండెక్స్‌ కోస్పీ 1శాతానికి పైగా నష్టపోయింది. జపాన్‌కు చెందిన నికాయ్‌ ఇండెక్స్‌ 0.12 శాతం స్వల్పంగా నష్టపోయింది. నికాయ్‌ ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ షేరు 3శాతం ర్యాలీ చేసి ఇండెక్స్‌కు అండగా నిలిచింది. వాటితో పాటు ఆసియాలో మిగిలిన దేశాలకు చెందిన హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ ఇండెక్స్‌, సెట్‌ కాంపోసైట్‌, జకర్తా ఇండెక్స్‌లు 1శాతం నుంచి అరశాతం నష్టాన్ని చవిచూశాయి.

ఇక అమెరికా మార్కెట్ల విషయానికోస్తే... అధిక వెయిటేజీ కలిగిన మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌, అమెజాన్‌లాంటి టెక్నాలజీ కంపెనీ షేర్లు 1శాతం వరకు పతనంకావడంతో  సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. డౌ జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఇండెక్స్‌ 128 పాయింట్లను కోల్పోయి 29,129 వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 12.92 పాయింట్లు నష్టపోయి 3,373.23 వద్ద, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 66 పాయింట్ల పెరిగి 9,750.96 వద్ద స్థిరపడ్డాయి.


ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లకూ నష్టాలే:- 
అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)ల్లో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు నష్టాలను చవిచూసాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ అత్యధికంగా 1.75శాతం క్షీణించింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 1శాతం, టాటా మోటర్స్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌ అరశాతం చొప్పున నష్టపోగా, ఐసీఐసీఐ ఏడీఆర్‌ ఎలాంటి లాభ, నష్టాలకు లోనుకాకుండా స్థిరంగా ముగిసింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ మాత్రం అరశాతం లాభంతో ముగిసింది. 



You may be interested

నేను నంబర్‌ 1, మోదీ నంబర్‌ 2..డోనాల్డ్‌ ట్రంప్‌!

Friday 21st February 2020

ఫేస్‌బుక్‌లో తాను నంబర్‌ 1 స్థానంలో ఉన్నానని, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తర్వాత రెండో స్థానంలో ఉన్నారని అమెరికా అధక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. లాస్‌వేగాస్‌లో జరిగిన హోప్‌ ఫర్‌ ప్రిసనర్స్‌ గ్రాడ్యూయేషన్‌ సెర్మనీలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. ఫేస్‌బుక్‌లో తనని ఫాలో అవుతున్న యూజర్ల సంఖ్యను బట్టి తాను నంబర్‌ 1 స్థానంలో ఉన్నట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జూకర్‌బర్గ్‌ స్వయంగా తనతో

ఇండియాతో భారీ డీల్‌ జరగొచ్చు..ట్రంప్‌!

Friday 21st February 2020

అమెరికా, భారత్‌ల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. లాస్‌వేగాస్‌లో ప్రిసనర్స్‌ గ్రాడ్యూయేషన్‌ సెర్మనీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఈ నెలలో తాము ఇండియా వెళ్తున్నామని, ఆదేశంతో భారీ ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. కాగా ఫిబ్రవరి 24 నుంచి 25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, యూఎస్‌ ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ అహ్మాదాబాద్‌, ఆగ్రా, న్యూఢిల్లీలో

Most from this category