News


ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 14th December 2019
Markets_main1576309945.png-30228

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్స్ సూచీ ముగింపు(12142.35)తో పోలిస్తే 6డాలర్లు స్వల్ప లాభంతో 12,149 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఫ్యూచర్‌ 122 పాయింట్లు లాభపడ్డప్పటికీ.., రాత్రి అమెరికా సూచీల ఫ్లాట్‌ ముగింపు కారణంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ సైతం అదే ట్రెండ్‌ను అవలంభించింది. అంతర్జాతీయంగా, దేశీయంగా గానీ నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకపోతే సోమవారం నిఫ్టీ సూచీ సైతం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల నిన్నటి ముగిసే సరికి సెన్సెక్స్‌ 428 పాయింట్ల లాభంతో 41,010 పాయింట్ల వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 12,087 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. 

ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 565 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఇదే వారంలో దేశీయ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.1,848.35 కోట్లు విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డీఐఐ)లు రూ.129.71కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఇక ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఈ వారం మొత్తం మీద 39పైసలు బలపడి 71.20 వద్ద స్థిరపడింది.

వచ్చేవారం మార్కెట్‌ అవుట్‌లుక్‌:- 
జాతీయ అంతర్జాతీ పరిణామాలే వచ్చే వారం మార్కెట్‌కు దిశానిర్దేశం కానున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందరూ అనుకున్నట్లే బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ ఎన్నిక కావడం, అమెరికా చైనా మధ్య మొదటి దశ వాణిజ్య చర్చలు సఫలవంతం కావడం లాంటి సానుకూల పరిణామాలు మన మార్కెట్‌కు కలిసొచ్చే అంశాలుగా మారాయి. అలాగే ఇప్పటికీ మన ఈక్విటీ మార్కెట్‌పై ఎఫ్‌ఐఐలు సానుకూల ధోరణితో ఉన్నారు. అక్టోబర్‌ నుంచి ఇప్పటికి ఎఫ్‌ఐఐలు 5.1డాలర్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు. 
అయితే ఇటీవల వెలువడిన దేశీయ ఆర్థిక గణాంకాలు మార్కెట్‌కు కొంత ప్రతికూలంగా మారాయి. ఈ వారంలో అక్టోబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు నవంబర్‌ రీటైల్‌ ద్రవ్యోల్బణ, ఎగుమతుల గణాంకాలు నిరాశజనకంగా నమోదుకావడం దలాల్‌ స్ట్రీట్‌ను ఆందోళనకు గురిచేస్తుంది. వినియోగం నెమ్మదించడం, ఉపాధి కల్పనలో మందగమనం లాంటి ప్రతికూలత నేపథ్యంలో 2019లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.6 శాతమే ఉంటుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. డిసెంబర్‌ 18న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ నేతృత్వంలోని జీఎస్టీ మండలి భేటీ కానుంది. ఆ మండలి సమావేశంలో జీఎస్టీ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. You may be interested

టీసీఎస్‌ షేర్లు అమ్మేసిన ఎస్‌పీ గ్రూప్‌

Saturday 14th December 2019

ద షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌(ఎస్‌పీ) గురువారం దాదాపు 19 లక్షల షేర్లను విక్రయించింది. ఈ విక్రయంతో గ్రూప్‌ రూ. 380 కోట్లు సమీకరించింది. ఈ నెల్లో ఎస్‌పీ గ్రూప్‌ టీసీఎస్‌ షేర్లను విక్రయించడం ఇది రెండో సారి. గతవారం గ్రూప్‌ దాదాపు 20 లక్షల షేర్లను రూ. 400 కోట్లకు అమ్మేసింది. గ్రూప్‌నకు ఉన్న రుణభారం తగ్గించుకునేందుకు ఈ విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపింది. స్టెర్లింగ్‌, విల్సన్‌ సోలార్‌లో ఉన్న రూ.

డిస్కౌంట్ల హోరు.. కార్ల విక్రయాల జోరు!

Saturday 14th December 2019

డిసెంబర్‌లో పెరిగిన కార్ల విక్రయాలు డిసెంబర్‌ చివరకు వస్తుండడంతో కార్ల కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను మరింత పెంచాయి. దీంతో ఈ నెల్లో కార్ల విక్రయాలు మరింత జోరందుకున్నాయి. దాదాపు 5- 15 శాతం మధ్య ఆయా కార్లకంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నాయి. కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న సందర్భంగా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీఎస్‌4 వాహనాలను పూర్తిగా వదిలించుకునే యత్నంలో భాగంగా కార్ల కంపెనీలు ఇలా

Most from this category