ఎస్జీఎక్స్ నిఫ్టీ 55 పాయింట్లు డౌన్
By Sakshi

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో కొనసాగడంతో ఆసియా మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో భారత్ మార్కెట్ సోమవారం సైతం గ్యాప్డౌన్తో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్జీఎక్స్ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఫ్యూచర్తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్జీఎక్స్ నిఫ్టీ ఈ ఉదయం 8.40 గంటలకు 55 పాయింట్లకుపైగా నష్టపోయి11,248 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్ 11,307 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా-అమెరికాల మధ్య వాషింగ్టన్లో ఆదివారం జరిగిన చర్చల్లో ఎటువంటి ఒప్పందం కుదరకపోగా, చైనా చట్టాల్ని మార్చాలని అమెరికా పట్టుబడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. చట్ట మార్పులకు తాము వ్యతిరేకమని, అవసరమైతే ‘చేదు గుళిక’ మింగడానికి సిద్ధమంటూ చైనా స్పష్టం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ట్రేడ్డీల్ కుదరడం కష్టసాధ్యమన్న అంచనాలు మార్కెట్లో తిరిగి తలెత్తడంతో తాజాగా ఆసియాలో జపాన్ నికాయ్ సూచి 6 వారాల కనిష్టస్థాయికి పడిపోయింది. సింగపూర్ స్ర్టయిట్టైమ్స్ 1 శాతంపైగా పతనంకాగా, తైవాన్, కొరియా మార్కెట్లు కూడా ఒక శాతం వరకూ తగ్గాయి. హాంకాంగ్ ఎక్సే్ఛంజ్కు సెలవు. మరోవైపు అమెరికా,యూరప్ మార్కెట్లు క్షీణతతో ప్రారంభమయ్యే సంకేతాల్ని సూచిస్తూ ఆయా దేశాల ఇండెక్స్ ఫ్యూచర్లు 1 శాతం మేర తగ్గుదలతో కదులుతున్నాయి.
You may be interested
నెగిటివ్ ప్రారంభం
Monday 13th May 2019అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న అంచనాలకు గండిపడటంతో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా సోమవారం భారత్ స్టాక్ సూచీలు గ్యాప్డౌన్తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 80 పాయింట్ల తగ్గుదలతో 37,370 పాయింట్ల సమీపంలో ప్రారంభంకాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11, 248 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో ఎస్బీఐ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, కోల్ ఇండియాలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు టాటా స్టీల్, ఐషర్ మోటార్స్,
చల్లబడిన డిమాండ్... దిగొస్తున్న ఎఫ్ఎంసీజీ స్టాక్స్
Monday 13th May 2019ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా ఉత్తమ స్టాక్ బెట్స్గా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్లో వినియోగం నిదానించడంతో ఈ షేర్లు దిగొస్తున్నాయి. ఎస్అండ్పీ బీఎస్ఈ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2006 నుంచి చూస్తే ఒక్కసారే డౌన్ అయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటి వరకు ఈ షేర్లు డబుల్ డిజిట్ నష్టాల్లో ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో లిక్విడిటీ కొరత వినియోగాన్ని