News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు డౌన్‌

Wednesday 26th June 2019
Markets_main1561519207.png-26569

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలత కారణంగా బుధవారం భారత్‌ మార్కెట్‌ నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.45 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు క్షీణించిం‍ది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,765 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూన్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,810 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రీమియర్‌ జీపింగ్‌ల మధ్య జపాన్‌లో జరగనున్న వాణిజ్య చర్చలు ఫలప్రదం కావన్న అనుమానాలతో గత రాత్రి అమెరికా మార్కెట్‌ క్షీణించగా, ఈ ఉదయం ఆసియా మార్కెట్లు సైతం తగ్గాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 26th June 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్ర‌భావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు స్పైస్ జెట్‌:- కొత్తగా ఎనిమిది నాన్-స్టాప్ ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాలను లాంచ్ చేసింది.  వెల్‌స్పన్ కార్ప్‌:- అర్హత క‌లిగిన షేర్ హోల్డర్లకు డివిడెండ్‌ను జారీ చేసేందుకు జూలై 05ను రికార్డు తేదిగా నిర్ణయించింది.  ప‌నోర‌మా స్టుడియో ఇంట‌ర్నేష‌న‌ల్:- ఇండియాలో సినిమాల పంపిణి వ్యాపారం కొర‌కు పీపీఆర్ పిక్చర్స్ తో జ‌త క‌ట్టింది.  విరించి:- ఫ్రిప‌రెన్షియ‌ల్ బేసిస్ ప‌ద్ధతిలో జ‌న‌వ‌రి 06వ తేదిన జారీ చేసిన 3.40 కోట్ల

లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌గెయిన్‌ టాక్స్‌ ఎత్తేస్తారా?!

Tuesday 25th June 2019

రాబోయే బడ్జెట్లో లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌(ఎల్‌టీసీజీ)ను పూర్తిగా ఎత్తేయడం లేదా కొంతమేర తగ్గించడమో చేయవచ్చని మార్కెట్‌ వర్గాలు ఆశిస్తున్నాయి. జూలై 5న కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎల్‌టీసీజీ నుంచి ఉపశమనం లభిస్తే క్యాపిటల్‌ మార్కెట్లు మరలా ఉత్తేజం పొందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్లో ఎక్కువమంది ఎల్‌టీసీజీ పూర్తిగా తీసివేస్తారని భావిస్తుండగా, కొందరు మాత్రం మినహాయింపు పరిమితిని లక్ష నుంచి రెండు లక్షల

Most from this category