News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు డౌన్‌

Friday 28th June 2019
Markets_main1561691998.png-26638

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలత కారణంగా శుక్రవారం భారత్‌ మార్కెట్‌ నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.45 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,888 పాయింట్ల వద్ద కదులుతోంది. గురువారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,908 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రీమియర్‌ జీపింగ్‌ల మధ్య జపాన్‌లో జరగనున్న వాణిజ్య చర్చలపై అనుమానాలు తలెత్తడంతో  ఈ ఉదయం ఆసియా మార్కెట్లు తగ్గాయి.  చైనా షాంఘై ఇండెక్స్‌  0.8 శాతం క్షీణించగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ అరశాతం, తైవాన్‌ వెయిటెడ్‌ 1 శాతం చొప్పున తగ్గాయి. జపాన్‌ నికాయ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌, కొరియా కోస్పి సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. 



You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం

Friday 28th June 2019

 ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నా, జూలై డెరివేటివ్‌ కాంట్రాక్టులకు తొలిరోజైన శుక్రవారం భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల పెరుగుదలతో 39,630 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్లు జంప్‌చేసి 11,861 పాయింట్ల వద్ద మొదలయ్యింది. అదాని పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహింద్రాలు 1 శాతం లాభంతో ప్రారంభంకాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జీ టెలి, యాక్సిస్‌బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు

మే మాసంలో పీఎంఎస్‌లకు లాభాలు

Thursday 27th June 2019

చాలా నెలల తర్వాత మే మాసంలో అధిక శాతం పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌(పీఎంఎస్‌)లు సానుకూల లాభాలను కళ్లజూశాయి. సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి మోదీ సర్కారే విజేతగా నిలవడంతో ఆ నెలలో స్టాక్‌ మార్కెట్లు మంచి ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పీఎంఎస్‌లలో 82 శాతం సానుకూల రాబడులను మేలో సంపాదించాయి. అంతకుముందు ఏప్రిల్‌ నెలలో కేవలం 30 శాతం పీఎంఎస్‌లే సానుకూల రాబడులను సంపాదించడం గమనార్హం.    ఎల్‌ఐసీ

Most from this category