News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 100 పాయింట్లు డౌన్‌

Monday 16th September 2019
Markets_main1568604319.png-28384

సౌదీ అరేబియలో రెండు చమురు ఉత్పాదక కేంద్రాలపై గత శనివారం టెర్రరిస్టులు...ద్రోణులతో జరిపిన దాడుల ప్రభావంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర భగ్గుమన్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 100 పాయింట్లు క్షీణించింది. ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఉదయం 8.50 గంటలకు 11,005 పాయింట్ల వద్ద కదులుతోం‍ది. గత శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్‌ ముగింపు ధర 11,115 పాయింట్లతో పోలిస్తే ప్రస్తుత ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 100 పాయింట్ల తగ్గుదలతో ట్రేడవుతోంది. ద్రోణ్‌దాడులతో సౌదీ చమురు ఉత్పాదక సామర్థ్యం 50 శాతం తగ్గుతుందని, తద్వారా చమురు ఎగుమతులు 5-6 శాతం వరకూ తగ్గవచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లో చమురు ధర ఒక్కసారిగా 20 శాతం ఎగిసింది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే ఇండియాపై చమురు ధర పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపించవచ్చన్న భయాలతో సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇస్తోంది. 

 



You may be interested

ప్యాకేజీ జోష్‌..!

Monday 16th September 2019

ఎగుమతులు, హౌసింగ్‌ రంగానికి ప్రభుత్వ ఉద్దీపన చర్యలు మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడనుందని అంచనాలు ఇతర ఆర్థికాంశాలపై మార్కెట్‌ వర్గాల దృష్టి సోమవారం టోకు ధరల ద్రవ్యోల్బణ డేటా వెల్లడి ఎఫ్‌ఓఎంసీ సమావేశం ఈవారంలోనే.. శుక్రవారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించారు. జీడీపీ వృద్ధిలో అత్యంత కీలకమైన ఎగుమతులు పుంజుకునేందుకు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జోష్‌ నింపడం

తాజా ప్యాకేజీ ఈ రంగాలకు సానుకూలం

Sunday 15th September 2019

ఆర్థిక రంగ వృద్ధిని పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో విడత పలు రంగాలకు ప్రోత్సాహకర చర్యలతో ముందుకు వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌, ఎగుమతుల రంగాలకు ప్రధానంగా పన్నుల రాయితీలు, ఫండింగ్‌, ఉద్దీపన చర్యలను ప్రకటించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రాజెక్టులు ముందుకు వెళ్లేందుకు రూ.20,000 కోట్ల నిధి, ఎగుమతులకు పన్ను రాయితీల కోసం రూ.50,000 కోట్లు ప్రకటించింది. ఈ చర్యలు ముఖ్యంగా ఎనిమిది రంగాలకు సానుకూలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా

Most from this category