News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నిలువునా పతనం

Monday 2nd September 2019
Markets_main1567417279.png-28150

సోమవారంనాటి సెలవు అనంతరం మంగళవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యే సంకేతాల్ని తాజాగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం మధ్యాహ్న సమయంలో 150 పాయింట్లకుపైగా పతనమయ్యింది. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో పాటు, ఈ జూన్‌ త్రైమాసికంలో  దేశ జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం, అలాగే ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా తగ్గినట్లు ఆదివారం గణాంకాలు వెలువడటం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించే మంత్రదండం లేదంటూ వ్యాఖ్యానించడం​ తదితర అంశాలు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్షీణతకు కారణాలని విశ్లేషకులు అంటున్నారు. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్‌ 11,059 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3.03 సమయానికి ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 146 పాయింట్లు కోల్పోయి 10913 పాయింట్ల వద్ద ట్రేడవుతోం‍ది. దీని ఫలితంగా మంగళవారం దేశియ బెంచ్‌ మార్క్‌ సూచీ నిఫ్టీ-50 సూచి భారీ గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభమవుతుందని విశ్లేషకులు తెలిపారు. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ట్రేడింగ్‌లో 10901.5 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని, 11035.0 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.



You may be interested

సెన్సెక్స్‌ను బీట్‌ చేస్తున్న షేర్లివే

Monday 2nd September 2019

మార్కెట్‌లలో కొనసాగుతున్న ప్రతికూలతను ఎదుర్కొని పుంజుకునేందుకు అనేక దేశియ స్టాకులు ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని స్టాకులు మాత్రమే అద్భుత ప్రదర్శనను చేస్తున్నాయి. బీఎస్‌ఈ 500 స్టాకులలో 26 స్టాకులు మాత్రమే గత మూడేళ్ల నుంచి సెన్సెక్స్‌ కంటే మంచి ప్రదర్శనను చేశాయి. పీ అండ్‌ జీ, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, వినాటి ఆర్గానిక్స్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, బాటా ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హనీవెల్ ఆటోమేషన్ వంటి స్టాక్స్

వైవిధ్యమైన పెట్టుబడులు కోసం

Monday 2nd September 2019

డి.జయంత్‌ కుమార్‌, థర్డ్‌ పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌  గడిచిన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో మార్కెట్లు తీవ్ర అస్థిరతలను ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితి మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం లేకపోలేదు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అస్థిరతలు దీర్ఘకాలంలో సంపద సృ‍ష్టికి దారితీసేవే అయినప్పటికీ, స్వల్ప కాలంలో ఎదురయ్యే నష్టాలు ఇబ్బంది పెడతాయి. రిస్క్‌కు విముఖంగా

Most from this category