News


11400ల దిగువన ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 20th July 2019
Markets_main1563604098.png-27202

విదేశీ మార్కెట్లలో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి 11380 వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11422 పాయింట్లతో పోలిస్తే 42 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావారణం నెలకొంది. ఆసియా మార్కెట్లు లాభాల్లోనూ ముగియగా, రాత్రి అమెరికా మార్కెట్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. దేశీయంగా ఎలాంటి అనూహ్య పరిణామాలూ జరగకపోతే  నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు బలపడటంతో  నిన్న ఆసియాలోని ప్రధాన సూచీలన్నీ శుక్రవారం 1-2 శాతం లాభంతో ముగిశాయి. జపాన్‌ దేశపు నికాయ్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2శాతం లాభపడింది. చైనాతో సహా మిగిలిన సూచీలన్నీ 1శాతానికి పైగా పెరిగింది. సింగపూర్‌కు చెందిన స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌ మాత్రం స్వల్పంగా అరశాతం లాభంతో ముగిసింది. 

కీలక వడ్డీరేట్లపై కోత విధింపు పావుశాతంగానే ఉండొచ్చనే అంచనాలతో రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వడ్డీరేట్లపై కోత విధింపు ప్రణాళికపై వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక విడుదల చేసింది. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లపై 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉండదని నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణత, ట్రేడ్‌వార్‌ ఆందోళనతో మందగించి ఆర్థిక వృద్ధి తదితరి ప్రతికూలంశాలు ఉన్నందున, రానున్న కాలంలో కోత విధింపు భారీగానే ఉండవచ్చని, ఇప్పటికి మాత్రం ఫెడ్‌ పావుశాతం కోత విధింపుకే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.  అలాగే ఈ వారంలో ఇప్పటి వరకు క్యూ2 ఫలితాలను ప్రకటించిన కంపెనీలు మార్కెట్‌ వర్గాలు నిరాశపరచడం, ఇరాన్‌ యుద్ధ వాతవరణ ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కడటం మార్కెట్‌కు ప్రతికూలాంశాలుగా మారాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్  0.3 శాతం (68.77 పాయింట్లు) నష్టంతో 27,154.20 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 0.6శాతం క్షీణించి 2,976.61 వద్ద, నాస్‌డాక్‌ 0.7శాతం పాయింట్లను కోల్పోయి 8,146.49 వద్ద స్థిరపడ్డాయి.

టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 3.50శాతం డౌన్‌:- 
 అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌) గత రాత్రి నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3.50శాతం నష్టపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 3శాతం, ఐసీఐసీసీ ఏడీఆర్‌ 2.50శాతం, విప్రో ఏడీఆర్‌ 2శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ షేర్లు 1.50శాతం క్షీణించాయి.



You may be interested

స్వల్ప నష్టంతో ముగిసిన పసిడి

Saturday 20th July 2019

పసిడి ఫ్యూచర్లలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఔన్స్‌ పసిడి ధర గురువారం ముగింపు (1,429)తో పోలిస్తే 1.50డాలర్ల స్వల్ప నష్టంతో 1,428.85 వద్ద స్థిరపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు మరింత బలపడటంతో పాటు, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తెరపైకి రావడంతో ఆసియా ట్రేడింగ్‌లో 26 డాలర్ల మేర లాభపడి 1,454.35 వద్ద ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. పసిడి

గ్లాండ్‌ ఫార్మా ఐపీఓ కోసం కోటక్‌, సిటీ, హైటాంగ్‌ బ్యాంకులు?

Saturday 20th July 2019

హైదరాబాద్‌కు చెందిన ఇంజెక్షన్ డ్రగ్స్ తయారీదారు గ్లాండ్ ఫార్మా ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిర్వహణ కోసం ఈ కంపెనీ పేరెంట్‌ సంస్థైనా చైనాకు చెందిన షాంఘై ఫోసున్ ఫార్మాస్యూటికల్‌ (ఫోసున్ ఫార్మా) మూడు మర్చెంట్‌ బ్యాంకులను ఎన్నుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫోసున్ ఫార్మా 2017 అక్టోబర్‌లో గ్రాండ్ ఫార్మాలో సుమారు 74 శాతం వాటాను 109 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన వాటా చాలావరకు వ్యవస్థాపక

Most from this category