News


27 పాయింట్ల లాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 5th October 2019
Markets_main1570252770.png-28731

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి లాభంతో ముగిసింది. ఇది 11,242.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11215.15 పాయింట్లతో పోలిస్తే 27 పాయింట్ల లాభంతో ఉంది. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష సందర్భంగా జీడీపీ అంచనానలను తగ్గించడం, డిమాండ్ పడిపోవడంతో సెప్టెంబర్‌లో దేశీయంగా సేవల రంగం కార్యకలాపాలు మందగించడంతో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సేవల వ్యాపార కార్యకలాపాల సూచీ (పీఎంఐ) సెప్టెంబర్‌లో 48.7 పాయింట్లకు క్షీణించడం తదితర అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల స్టాక్స్‌లో అమ్మకాలు జరగడంతో కీలక సూచీలు కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ 434 పాయింట్లు క్షీణించి 37,674 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 134 పాయింట్లు క్షీణించి 11,175 పాయింట్ల దగ్గర ముగిశాయి. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్‌ 1,149 పాయింట్లు (2.96 శాతం), నిఫ్టీ 338 పాయింట్లు (2.93 శాతం) క్షీణించాయి. వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్ల ట్రెండ్‌ను కంపెనీల క్యూ2(జూలై-సెప్టెంబర్‌) ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్‌ వచ్చే  గురువారం నుంచీ ప్రారంభంకానుంది. శుక్రవారం(11న) సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగల సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ పనితీరు వెల్లడికానుంది. 



You may be interested

రేట్‌ కట్‌తో లాభపడే స్టాకులు!

Saturday 5th October 2019

ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) ఎంపీసీ(మానేటరీ పాలసీ కమిటీ) శుక్రవారం సమావేశంలో మరో 25 బీపీఎస్‌(బేసిస్‌ పాయింట్లు) రెపో రేటును తగ్గించింది. దీంతో ఈ ఏడాది మొత్తంగా 135 బేసిస్‌ పాయింట్లు వరకు రెపో రేటును తగ్గించినట్టయింది. ఈ చర్య వలన నిర్ధిష్టంగా కొన్ని స్టాకులు లాభపడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. వివిధ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం రేట్‌ కట్‌ వలన లాభపడే స్టాకులు: విశ్లేషకులు: అజిత్‌ మిశ్రా, వైస్‌ ప్రెసిడెంట్‌ రిసెర్చ్‌, రెలిగర్‌

నిఫ్టీ చార్టుల్లో బేరిష్‌క్యాండిల్‌!

Saturday 5th October 2019

11100 పాయింట్ల వద్ద కీలక మద్దతు శుక్రవారం సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దీంతో ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 11200 పాయింట్ల దిగువకు చేరింది. ఆర్‌బీఐ తాజా ప్రకటనలో వృద్ధి అంచనాలను తగ్గించడమే మార్కెట్లో భయానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. తాజా క్షీణతతో నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏ దిగువకు చేరి చార్టుల్లో పెద్ద బేరిష్‌క్యాండిల్‌ ఏర్పరిచింది. వీక్లీ చార్టుల్లో

Most from this category