News


43 పాయింట్లు నష్టపోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 30th November 2019
Markets_main1575099489.png-29979

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం నష్టంతో ముగిసింది. శుక్రవారం నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 12099.85తో పోలిస్తే 43 పాయింట్ల నష్టంతో 12,056.00 వద్ద స్థిరపడింది.  వాణిజ్య చర్చల ఒప్పందంపై అనుమానాలు రెకెత్తడంతోపాటు జీడీపీ డేటాపై అంచనాలతో క్రితం రోజు నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభం నుండి దిద్దుబాటుకు లోనుకావడంతో12,050 స్థాయి వద్ద ముగిసింది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ...ఇక్కడి నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌తో అనుసంధానమై ట్రేడవుతుంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి క్షీణించడం, మన మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడిన దేశీయ డేటా ప్రకారం జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయికి క్షీణించడం వంటి అంశాల కారణంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 43 పాయింట్ల మేర తగ్గింది. ఈ సంకేతాల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు ఏమీ జరగకపోతే.. సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు నెగిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశం వుంది. 

నష్టాల్లో ముగిసిన అమెరికా ఏడీఆర్‌లు...
అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఒకరోజు సెలవు శుక్రవారం ప్రారంభమైన అమెరికా మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. హాంగ్‌కాంగ్‌ విషయంలో యుఎస్-చైనా విబేధాలు వాణిజ్య చర్చలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చనే అందోళనలు, బ్లాక్‌ ఫ్రైడే సందర్భంగా అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రిటైల్‌ స్టాక్‌ పతనం సూచీల నష్టాలకు కారణమయ్యాయి. ఈ అంశాలకు తోడు, భారత్‌ జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో  మన ఏడీఆర్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక్క ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ మాత్రం అరశాతం పెరిగింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ అత్యధికంగా 3శాతం నష్టపోయింది. వేదాంత ఏడీఆర్‌ 2.75శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 2.50శాతం క్షీణించాయి. అలాగే విప్రో ఏడీఆర్‌ 1.50శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

ముడి చమురు 4 శాతం క్రాష్‌!

Saturday 30th November 2019

అమెరికా-చైనా మధ్య రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతోపాటు, అమెరికా చమురు ఉత్పత్తి గరిష్ఠంగా పెరగడంతో గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. యుఎస్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ 4 శాతం మేర పతనమయ్యింది. అయినప్పటికి వచ్చే నెల జరగనున్న ఒపెక్‌ సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను పొడిగించే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో చమురు ధరల నెల సగటు గరిష్టం కంటే పైనే ముగిశాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.44 డాలర్లు పడిపోయి 62.43 డాలర్లకు

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ..విశ్లేషకులు ఏమంటున్నారు?

Saturday 30th November 2019

దేశ ఆర్థిక వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసికం(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం)లో ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవ్వడం గమనార్హం. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. సెప్టెంబర్‌ త్రైమాసికానికిగాను దేశ ఆర్థిక డేటాపై వివిధ ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అభిప్రాయాలు.. అమర్‌ అంబాని, సీనియర్‌ ప్రైసిడెంట్‌

Most from this category