News


స్వల్ప నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd November 2019
Markets_main1574490587.png-29811

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 11914.50తో పోలిస్తే 6 పాయింట్లు నష్టంతో 11,920 వద్ద స్థిరపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యుత్త ప్రదర్శన కారణంగా ఈ వారం నిఫ్టీ 12000 స్థాయిని​బ్రేక్‌ చేసింది. అయితే ఈ మేజిక్‌ మార్కుపై ముగియడంలో మాత్రం విఫలమైంది. వారం మొత్తంగా నిప్టీ ఇండెక్స్‌ 21 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్‌ మాత్రం 2 పాయింట్లు మాత్రమే పెరిగింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌ మార్కెట్ ప్రస్తుత స్థితిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఈ నెల ప్రారంభం నుంచి కరెక‌్షన్‌ దశలో ఉంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు ర్యాలీ తర్వాత ఇది మార్కెట్లో జరిగిన మొదటి కరెక‌్షన్‌. రానున్న రోజుల్లో అతిపెద్ద అప్‌ట్రెండ్‌ ఉండవచ్చని ప్రస్తుత కరెక‌్షన్‌ తెలియజేస్తుంది. ఇప్పుడు మార్కెట్‌ రంగాల వారీగా రాణించాల్సి ఉంది. ముఖ్యంగా స్క్రాప్ పాలసీపై మరింత స్పష్టత వస్తే అటో రంగంలో అప్‌-మూవ్‌ జరిగే అవకాశం ఉంది. 

నష్టాల్లో ముగిసిన ఏడీఆర్‌లు...

అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఒక్క వేదాంత తప్ప మిగిలిన ఏడీఆర్‌లు అమ్మకాలు ఒత్తిడికిలోనయ్యాయి. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అత్యధికంగా 2.74 శాతం నష్టపోయింది. టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 1.85శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.50శాతం నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం క్షీణించగా, విప్రో ఏడీఆర్‌ అరశాతం, హెచ్‌డీఎఫ్‌సీఏ ఏడీఆర్‌ 0.13శాతం పతనమయ్యాయి. అయితే వేదాంత ఏడీఆర్‌ మాత్రం 2.11శాతం లాభంతో ముగిసింది. 
డెరివేటివ్స్‌ ముగింపు, క్యూ2 జీడీపీ గణాంకాలపై కన్ను! 
వచ్చే వారం సూచీలు హెచ్చుతగ్గుల మధ్య కదిలే అవకాశముంది. నవంబర్‌ నెల డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. ఈ నెల 28న(గురువారం) ఎఫ్‌అండ్‌వో నవంబర్‌ సిరీస్‌ గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లను డిసెంబర్‌ సిరీస్‌కు రోలోవర్‌ చేసుకునే నేపథ్యంలో ప్రధాన సూచీలు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశముంది.  ప్రభుత్వం ప్రకటించే జీడీపీ డేటాపై దృష్టి సారించొచ్చు. ఇది మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంది. ఈ డేటా ఆధారంగా ఆర్‌బీఐ ఒకవేళ తన సర్దుబాటు ధోరణిని తటస్థానికి మార్చుకుంటే అది మార్కెట్‌ ర్యాలీకి విఘాతం కలిగిస్తుంది. వీటితోపాటు డాలరుతో మారకంలో మారకపు విలువ, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరు, అంతర్జాతీయ అంశాలు సైతం మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. You may be interested

ఆటుపోట్ల మార్కెట్లో అవలంబించాల్సిన సూత్రాలు!

Saturday 23rd November 2019

కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లు అటుఇటు ఊగిసలాడుతూ కొనసాగుతున్నాయి. మందగమనం, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సంక్షోభం, ఐఐపీ క్షీణత లాంటి అంశాలు మార్కెట్‌ ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎంత యత్నిస్తున్నా మార్కెట్లో సెంటిమెంట్‌ పూర్తి పాజిటివ్‌గా మారడం లేదు. ఈ నేపథ్యంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పక పాటించాల్సిన సూత్రాలని నిపుణులు వివరిస్తున్నారు.  1. అనవసర పుకార్లను నమ్మొద్దు: మార్కెట్లో వినిపించే పుకార్లు ఇన్వెస్టర్‌కు ఒక్కోసారి అత్యాశను కలిగిస్తే ఒక్కోసారి హడలెత్తిస్తుంటాయి.

స్టాక్‌ విలువపై దృష్ఠిపెట్టండి..ఆర్థిక అంచనాలపై కాదు!

Saturday 23rd November 2019

-ప్రశాంత్‌ జైన్‌ జీడీపీ వృద్ధిరేటు తాత్కాలికంగా పడిపోయినంత మాత్రాన స్టాక్‌ మార్కెట్లను ప్రతికూల దృక్పథంతో చూడకూడదని దేశీయ స్టార్‌ ఫండ్‌ మేనేజర్‌, ఈ ఏడాదితో ఒకే ఫండ్‌ను 25 ఏళ్లు నిర్వహించిన ఘనతను సాధించిన ప్రశాంత్‌ జైన్‌ అన్నారు.   ‘జీడీపీ వృద్ధి రేటు  8 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. కానీ ఇది ఎల్లప్పుడు అక్కడే ఉండదు’ అని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఈడీ, సీఐఓగా విధులు నిర్వర్తిస్తున్న

Most from this category