News


స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 14th September 2019
Markets_main1568444029.png-28374

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శనివారం స్వల్పలాభంతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ ముగిసే సరికి 11,130.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11105.55 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపు (11111.00)తో పోలిస్తే 19 పాయింట్ల లాభంతో ఉంది. జాతీయ, అంతర్జాతీయంగా నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వడ్డీరేట్ల కోత అంచనాలు బలపడటంతో శుక్రవారం నిఫ్టీ ఇండెక్స్‌ 93.10 పాయింట్లు పెరిగి 11,075.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 10950 కీలకమద్దతు స్థాయి వద్ద రీబౌన్స్‌ ప్రదర్శించి డైలీ, వీక్లీ ఛార్ట్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నిఫ్టీ ఇండెక్స్‌ రికవరీ మూడ్‌లో ఉంది. అప్‌సైడ్‌ ర్యాలీకి మరిన్ని లెగ్స్‌ మిగిలి ఉన్నాయి. మార్కెట్లో బుల్‌రన్‌ కొనసాగే అవకాశం ఉన్నందున ట్రేడర్లు లాంగ్‌పొజిషన్లు తీసుకునే అవకాశం ఉంది. వీక్లీ ఛార్ట్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. నిఫ్టీ అప్‌సైడ్‌ నిరోధం 11,300-11,500 శ్రేణిలో, డౌన్‌సైడ్‌ మద్దతు 10,870-10,750 స్థాయిలో ఉండొచ్చని ఇండియాబుల్స్‌ వెంచర్‌ సాంకేతిక సలహాదారుడు అమిత్‌షా అభిప్రాయపడుతున్నారు. 
వచ్చే మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు:- 
ఇక వచ్చేవారంలో ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాలు మంగళ(17న), బుధవారాల్లో(18న) జరగనున్నాయి. గురువారం(19న) జపాన్‌(బీవోజే) పరపతి విధాన సమీక్ష సమావేశం జరగనుంది. వస్తుసేవల పన్ను మండలి సమావేశం శుక్రవారం(20న)  గోవాలో జరగనుంది. దేశీయంగా సోమవారం(16న) ఆగస్ట్‌ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ)గణాంకాలు వెలువడనున్నాయి. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, తదితర పలు అంశాలు దేశీ మార్కెట్‌ను ప్రభావితం చేయగలవు. You may be interested

వివిధ రంగాలకు ఉద్దీపన....2.30 గంటలకు ఆర్థిక మంత్రి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌!

Saturday 14th September 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(సెప్టెంబర్‌ 14) మధ్యాహ్నాం 2.30 సమయానికి జాతియ మిడియా కేంద్రం, ఢిల్లీ నుంచి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు  వివిధ రంగాల వారిగా మరికొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు. కాగా ఈ రోజు మధ్యాహ్నాం 2.30కి ఆర్థిక మంత్రి ఢిల్లీ నుంచి ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడనున్నారని

స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో టాప్‌ సిఫార్సులు

Saturday 14th September 2019

దీర్ఘకాలానికి గాను బ్రోకరేజిలు సిఫార్సు చేసిన స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ స్టాకులు: విశ్లేషకులు: ట్రేడింగ్‌బెల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, అమిత్ గుప్తా బీసీఎల్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ రేణుక షుగర్స్‌ ప్రభుత్వం చమురు దిగుమతి బిల్లులను తగ్గించుకోడానికి ప్రయత్నిస్తోంది. ఫలితంగా ఇథనాల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభ్తుత్వం ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌(ఈబీపీ)ని ప్రోత్సహిస్తుండడంతో బీసీఎల్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ రేణుక షుగర్స్‌ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది.  అఫ్లె ఇండియా మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో వృద్ధి చెందుతుండడంతో అఫ్లె

Most from this category