News


12పాయింట్ల నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 21st December 2019
Markets_main1576913323.png-30353

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం స్వల్పంగా నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్స్ సూచీ ముగింపు(12290)తో పోలిస్తే 12 పాయింట్లు నష్టపోయి 12,278 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా, దేశీయంగా గానీ నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకపోతే సోమవారం నిఫ్టీ సూచీ స్వల్పంగా నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిన్నటి రోజుల ఉదయం సెషన్‌లో సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు వరుసగా నాలుగో రోజూ కొత్త రికార్డు స్థాయిలను నమోదుచేశాయి. సెన్సెక్స్‌ 136 పాయింట్లు పెరిగి 41,810 వద్ద, నిఫ్టీ 12294 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి.  వృద్ధి అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం ప్రతికూల ప్రభావం చూపించాయి.  సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 41,682 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల పెరిగి 12,272 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లు హోరెత్తిపోయాయి. మొత్తం 5 ట్రేడింగ్‌ రోజుల్లో నాలుగు రోజులు సెన్సెక్స్‌, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. 
వచ్చే వారం అవుట్‌లుక్‌:- 
వచ్చేవారం స్టాక్‌ మార్కెట్‌కు ఈ ఏడాది చివరి వారం అవుతుంది. ఈ వారంలో ట్రేడింగ్‌లో 4రోజలు మాత్రమే జరుగుతుంది.  క్రిస్మస్‌ రోజు పండుగ(డిసెంబర్‌ 25న)రోజు సందర్భంగా మార్కెట్‌కు బుధవారం  సెలవు రోజు. ఈ మరుసటి రోజు గురువారం డిసెంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ ముగింపు ఉంటుంది. ట్రేడర్లు తమ పొజిషన్లను జనవరి కాంటాక్టు మార్చుకోనున్న నేపథ్యంలో సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. 



You may be interested

లాభపడ్డ ఏడీఆర్‌లు

Saturday 21st December 2019

అమెరికాలో ట్రేడయ్యే భారత్‌ ఏడీఆర్‌లు శుక్రవారం దాదాపు 2శాతం వరకు పెరిగాయి. టాటా మోటర్స్‌, వేదాంత ఏడీఆర్‌లు తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు 2శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. విప్రో ఏడీఆర్‌ అత్యధికంగా 2శాతం పెరిగింది. ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1.50శాతం లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 1శాతం నష్టపోగా, వేదాంత ఏడీఆర్‌లు అరశాతం పతనయ్యాయి.  రికార్డు స్థాయిలో

బీపీసీఎల్‌ కొనేందుకు తప్పక పోటీపడతాం!

Saturday 21st December 2019

వేదాంత చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ భారత పెట్రోలియ కార్పొరేషన్‌ కొనుగోలుకు తప్పక పోటీపడతామని, బీపీసీఎల్‌ ఆఫర్‌కు తప్పక బిడ్‌ వేస్తామని వేదాంత రిసోర్సెస్‌ చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. బీపీసీఎల్‌లో 53.29 శాతం వాటా విక్రయానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ‘‘బిడ్స్‌పై పరిశీలిన జరుపుతున్నాం, దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తిలో మాకు 30 శాతం వాటా ఉంది, ఈ వ్యాపారంలో చాలా సంవత్సరాలుగా ఉన్నాం. అందువల్ల ఈ

Most from this category