News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కదలికల్లో హైడ్రామా..పాజిటివ్‌ ముగింపు

Saturday 24th August 2019
Markets_main1566626114.png-27989

శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత దేశ, విదేశాల్లో పలు సానుకూల, ప్రతికూల వార్తలు వెలువడిన నేపథ్యంలో గత రాత్రి విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ లాభపడింది. సింగపూర్‌లో ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ ముగిసే సరికి 10,865.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,842 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. క్రితం రోజు మన మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కెందుకు పలు ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. విదేశీ ఇన్వెస్టర్లపై విధించిన అధిక పన్నులను వెనక్కి తీసుకోవడం, స్టారప్‌లకు అంకుర్పారణ పన్ను ఉపసంహరించుకోవడం లాంటి తాయిలాలిచ్చారు. ఫలితంగా తొలుత ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌... నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(10842)తో పోలిస్తే 106పాయింట్లు పెరిగి 10948.50 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ దశలో అనూహ్యంగా ట్రేడ్‌వార్‌ తెరపైకి రావడంతో సూచీ లాభాలు హరించుకుపోయాయి. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10శాతం సుంకాలను విధిస్తున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని ఉత్పత్తులపై డిసెంబర్‌ 15 నుంచి మరికొన్ని ఉత్పత్తులపై పెరిగిన సుంకాల శాతం అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆ తర్వాత వెనువెంటనే అమెరికా అధ్యక్షడు ట్రంప్‌...చైనా నుంచి అమెరికా కంపెనీలను వచ్చేయాలంటూ పిలుపునివ్వడం, చైనా దిగుమతులుపై అదనపు సుంకాల్ని విధించడం వంటి పరిణామాల తర్వాత ఎస్‌జీక్స్‌ నిఫ్టీ లాభాలు చాలావరకూ హరించుకుపోయాయి. ఈ ట్రేడ్‌వార్‌తో అమెరికా సూచీలు కూప్పకూలడం, ఆసియా ఇండెక్స్‌ ఫ్యూచర్లు నిలువునా పతనంకావడం జరిగినప్పటికీ, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ స్వల్పలాభాలతో ముగియడం విశేషం. 
మళ్లీ తెరపైకి ట్రేడ్‌వార్‌: భారీ నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు
అమెరికా, చైనాల మధ్య మరోసారి ట్రేడ్‌వార్‌ తెరపైకి వచ్చింది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్‌ భారీ నష్టంతో ముగిసింది. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 5 నుంచి 10శాతం అదనపు సుంకాలను వేస్తున్నట్లు  చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని ఉత్పత్తులపై.. డిసెంబర్‌ 15 నుంచి మరికొన్ని ఉత్పత్తులపై పెరిగిన సుంకాల శాతం అమల్లోకి వస్తాయని వివరించింది. వ్యవసాయం, ఇంధనం, చిన్న తరహా విమానాలు, కార్లు.. ఇలా మొత్తం 5,078 వివిధ రకాల అమెరికా దిగుమతి ఉత్పత్తులపై ఈ సుంకాలను విధిస్తున్నట్లు చైనా తెలిపింది. ఈ నేపథ్యంలో డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌  623.34 పాయింట్లు(2.4శాతం) నష్టపోయి 25,628.90 వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 2.6శాతం క్షీణించి 2,847.11 వద్ద, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 3శాతం పతనమైన 7,751.77 వద్ద ముగిశాయి. 
మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌:- 
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఐసీఐసీఐ ఏడీఆర్‌, టాటామోటర్స్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ అరశాతం వరకు నష్టపోయాయి. ఐసీఐసీఐ ఏడీఆర్‌ 4.50శాతం ర్యాలీ చేసింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 1.45శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1శాతం ర్యాలీ చేయగా, ఇన్ఫోసిస్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 1శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. You may be interested

కన్నుమూసిన అరుణ్‌ జైట్లీ

Saturday 24th August 2019

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆనారోగ్యం కారణంగా శనివారం మధ్యాహ్నాం కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని శుక్రవారం డిల్లీ ఎయిమ్స్‌కు మార్చారు. కిడ్ని సమస్యతో భాదపడుతున్న జైట్లీకి, ఈ ఏడాది మే 14 న రెంటల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ జరిగిన విషయం తెలిసిందే.

మళ్లీ సుంకాల పోరు..ముదిరిన వాణిజ్య యుద్ధం

Saturday 24th August 2019

యుఎస్‌ టారిఫ్‌లకు దీటుగా సుంకాలను విధించిన చైనా 75 బి. డా. యుఎస్‌ దిగుమతులపై 10 శాతం సుంకం ఫలితంగా 550 బి.డా. చైనా దిగుమతులపై 5 శాతం అదనపు సుంకం విధించిన ట్రంప్‌ చైనా నుంచి బయటకు వచ్చేయమని అమెరికన్‌ కంపెనీలను కోరిన ట్రంప్‌  టిట్‌ ఫర్‌ టాట్‌..వాణిజ్య యుద్ధం అమెరికాకు దీటుగా చైనా స్పందించింది. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం

Most from this category