News


స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 17th August 2019
Markets_main1566022237.png-27832

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్పంగా లాభపడింది. సింగపూర్‌లో ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ముగిసే సరికి 11,069.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11064.65 పాయింట్లతో పోలిస్తే 5 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 
లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్‌:-

జర్మన్‌ ఆర్థిక ఉద్దీపన చర్యలు వార్తలతో పాటు బాండ్‌ ఈల్డ్‌ ర్యాలీ నెమ్మదించడంతో శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభంతో ముగిశాయి. ప్రధాన సూచీలైన డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 306.62 పాయింట్లు పెరిగి 25,886.01 వద్ద, ఎస్‌ అండ్‌ పీ 41.09 పాయింట్లు ర్యాలీ చేసి 2,888.69 వద్ద, నాస్‌ డాక్‌ ఇండెక్స్‌ 129 పాయింట్లు లాభపడి 7,896 వద్ద ముగిశాయి.  జర్మనీ సంకీర్ణ ప్రభుత్వం తన బ్యాలెన్స్‌డ్‌ బడ్జెట్‌ రద్దు చేయడంతో పాటు రుణాల స్వీకరణకు సిద్ధమైనట్లు డెర్ స్పీగెల్ మ్యాగజైన్ ఒక కథనాన్ని వెల్లడించింది. యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ​కలిగిన జర్మన్‌ తీసుకుంటున్న ఆర్థిక ఉద్దీపన చర్చలు ఆర్థిక మాంద్యపు భయాలను తగ్గించవచ్చనే ఆశలు చిగురించాయి. 
 అమెరికా-చైనాల మద్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం, అట్టుడుకుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్‌ మార్కెట్‌ నుంచి ప్రతికూల సంకేతాలు తదితర అంశాలతో ఈ వారం ఆద్యంతం అమెరికా సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇండెక్స్‌లకు ఇది వరుసగా మూడో వారం నష్టాల ముగింపు.

టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 3.50శాతం ర్యాలీ:- 
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు ర్యాలీ నేపథ్యంలో ఏడీఆర్‌లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 3.50శాతం వరకు లాభపడ్డాయి. అత్యధికంగా టాటామోటర్‌ ఏడీఆర్‌ 3.50శాతం ర్యాలీ చేసింది. అలాగే ఐసీఐసీఐ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు 1.50శాతం పెరిగాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ ఒకశాతం పెరగ్గా, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌లు అరశాతం ర్యాలీ చేశాయి. You may be interested

గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం!

Saturday 17th August 2019

అంతర్జాతీయ మందగమన పరిస్థితులు తగ్గకపోవడంతో పాటు ట్రేడ్‌వార్‌ అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌)లో అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఇన్వెస్టర్లు ఏకంగా 2.6 కోట్ల డాలర్ల పెట్టుబడులను గోల్డ్‌ ఈటీఎఫ్‌లో పెట్టారని, మార్చి 2013 తర్వాత ఇదే అత్యధికమని ప్రపంచ గోల్డ్‌ సమాఖ్య విడుదల చేసిన డేటా పేర్కొంది. కాగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో బుల్‌ రన్‌ ఇంకొంత కాలం కొనసాగే అవకాశం ఉందని

ప్యాకేజీ సోమవారం వరకూ లేనట్టే!

Saturday 17th August 2019

ఆర్థిక ఉద్ధీపన ప్యాకేజీపై చర్చించడానికి వివిధ శాఖలతో మరిన్ని సమావేశాలను ప్రభుత్వం ప్లాన్‌ చేస్తుండడంతో, సోమవారంలోపు ఎటువంటి ప్యాకేజి వెలువడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సంబం‍ధిత అధికారులతో గురువారం చర్చించిన విషయం తెలిసిందే. విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)ను అధిక పన్ను నుంచి మినహాయించడం, లిస్టెడ్ కంపెనీల్లో కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి

Most from this category