News


42 పాయింట్ల నష్టపోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Saturday 31st August 2019
news_main1567237310.png-28129

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల్లో ముగిసింది. సింగపూర్‌లో ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ముగిసే సరికి 11,012.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11058.90 పాయింట్లతో పోలిస్తే 47 పాయింట్ల నష్టంతో, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 42 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొండిబాకీలతో కుదేలవుతున్న బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం పది బ్యాంకుల విలీనాన్ని ప్రకటించడం, ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి పతనం కావడం తదితర అంశాలు కీలకంగా కానున్నాయి. ఈ క్యూ1లో దేశీయ జీడీపీ కేవలం 5 శాతంగా నమోదయ్యింది. 2012-13 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కేవలం 4.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక అంతర్జాతీయ అంశాలను అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ద పరిస్థితులు ప్రభావాన్ని చూపనున్నాయి. అలాగే నిన్నటి రోజున రూపాయి రెండు వారాల గరిష్టాన్ని చేరుకున్నప్పటికీ.., డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా రానున్న రోజుల్లో రూపాయి ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు తప్పవని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. 
మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు:-
అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. చైనాకు చెందిన 300బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10శాతం పన్ను విధింపు ఈ సెప్టెంబర్‌1 నుంచి అమలు కానుడటం, అలాగే నిన్న వారంతపు రోజు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అ‍మ్మకాలకు మొగ్గుచూపారు. ప్రధాన సూచీలైన డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌  41.03 పాయింట్లు పెరిగి 26,403.28 వద్ద, ఎస్‌ అండ్‌ పీ 1.88  పాయింట్లు ర్యాలీ చేసి  2,926.46 వద్ద, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 10.51 పాయింట్లు నష్టపోయి 7,962.88 వద్ద స్థిరపడ్డాయి. 
లాభాలతో ముగిసిన ఏడీఆర్‌లు:- 
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ ఏడీఆర్‌, టాటామోటర్స్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు అరశాతం నుంచి 2.50శాతం ర్యాలీ చేశాయి. అత్యధింకంగా విప్రో ఏడీఆర్‌ 2.50శాతం పెరిగింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.50శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 1శాతం ర్యాలీ చేయగా, ఐసీఐసీఐ ఏడీఆర్‌ షేర్లు అరశాతం పెరిగింది.



You may be interested

మూడు రోజూ నష్టాల్లో ముగిసిన పసిడి ధర

Saturday 31st August 2019

డాలర్‌ ఇండెక్స్‌లో బుల్లిష్‌ కదలిక నెలకొన్న నేపథ్యంలో పసిడి ధర వరుసగా మూడోరోజూ నష్టాలతో ముగిసింది. అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి  ఔన్స్‌ పసిడి ఫ్యూచర్‌ ధర 7.75డాలర్లు క్షీణించి 1,529.15 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ అరశాతం ర్యాలీ చేసి 98.94 స్థాయి వద్ద ముగిసింది. ఈ వారంలో జరిగిన అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ఈక్విటీ, బాండ్‌

ఉద్యోగులను తొలగిస్తున్న ఆటో కంపెనీలు!

Saturday 31st August 2019

 వరుసగా తొమ్మిదివ నెలలో(జులై) కూడా వాహనాల అమ్మకాలు క్షీణించడంతో దేశియ ఆటో రంగ సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. అంతేకాకుండా ఖర్చులను అదుపులో ఉంచడానికి తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయని రాయిటర్స్ ఓ నివేదికలో పేర్కొంది. క్షీణిస్తున్న అమ్మకాలను ఎదుర్కోడానికి జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్, దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ తమ కంపెనీల ఉత్పత్తిలో కొన్ని భాగాలను నిలిపివేశాయని రాయిటర్స్‌ తెలిపింది. జూలై నెలలో ప్రయాణీకుల

Most from this category