STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Saturday 2nd November 2019
Markets_main1572681050.png-29306

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం లాభంతో ముగిసింది.  నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి11928.25 తో పోలిస్తే 29పాయింట్ల లాభంతో 11,958 వద్ద స్థిరపడింది. పలు కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండటం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలో మందమన నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం ఈక్విటీలపై పన్ను తగ్గింపు యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడటం, అంచనాలకు తగ్గట్టుగానే ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించడం, అక్టోబర్‌ అటో అమ్మకాలు ఆశాజనకంగా ఉండటం తదితర కారణాలతో ఈ వారం మార్కెట్‌లో కొనుగోళ్లు కొనసాగాయి. ఫలితంగా ఈ వారంలో మొత్తం మీద సెన్సెక్స్‌ 914.83(2.33శాతం) పాయింట్లు పెరిగి 40,165.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 263.45 పాయింట్లు లాభపడి (2.26 శాతం) 11,890.6 వద్ద స్థిరపడింది.
వచ్చే వారం మార్కెట్‌ను ప్రభావితం చేయగల అంశాలు:-
1. ఎన్‌పీఏలు పెరగడంతో యస్‌బ్యాంక్‌ క్యూ2లో రూ.600 కోట్ల నష్టాన్ని చవిచూసింది
2. జీఎస్‌టీ వసూళ్లు వరుసగా రెండోనెల తగ్గుముఖం పట్టాయి. ఈ అక్టోబర్‌లో మొత్తం వసూళ్లు రూ.1లక్ష కోట్ల దిగువన రూ.95,380 కోట్లుగా నమోదయ్యాయి.
3. ఆటో అమ్మకాలు అక్టోబర్‌లో ఆశాజనకంగా నమోదయ్యాయి. మారుతి సుజుకీ 8నెలల అనంతరం అమ్మకాల్లో వృద్ధి కనబరిచింది. 
4. అమెరికా అక్టోబర్‌ ఉపాది కల్పన మార్కెట్‌ అంచనాలకు మించి నమోదు కావడంతో అక్కడి ప్రధాన ఇండెక్స్‌లు 1శాతానికి పైగా లాభంతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. 
5. అక్టోబర్‌లో  ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 50.6 పాయింట్లుగా నమోదయ్యింది. గడచిన రెండేళ్లలో ఇంత తక్కువ స్థాయి సూచీ ఇదే తొలిసారి. 



You may be interested

ఈ షేర్లు కొనొచ్చు

Saturday 2nd November 2019

పటిష్టమైన అప్‌ట్రెండ్‌లో వున్న ప్రస్తుత మార్కెట్లో మధ్య కాలానికి రాబడుల్ని ఇవ్వగలిగే షేర్లను వివిధ విశ్లేషకులు సూచించారు. అవి.... విశ్లేషకులు: ముస్తఫా నదీమ్, సీఈఓ, ఎపిక్ రీసెర్చ్ వోల్టాస్ లిమిటెడ్: కొనచ్చు: ప్రస్తుత ధర: రూ .713 | టార్గెట్‌ ధర: రూ 775-830 | స్టాప్‌ లాస్‌: రూ .650 | అప్‌ సైడ్‌: 16 శాతం పెరగొచ్చు ఎయిర్ కండీషనర్(ఏసీ) మార్కెట్ గత కొన్నేళ్ల నుంచి బలమైన వృద్ధిని కనబరుస్తోంది. ఈ

అమెరికా మార్కెట్ల రికార్డుల హోరు

Saturday 2nd November 2019

కొత్త జీవికాల గరిష్టాలకు ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు  కలిసొచ్చిన అక్టోబర్‌ ఉపాధి కల్పన గణాంకాలు అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ రికార్డు ర్యాలీ చేశాయి. అక్టోబర్‌లో ఉపాధి కల్పన అంచనాలకు జరగడం, చైనా తయారీ రంగ గణాంకాలు మూడేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ చర్చల్లో భాగంగా మొదటి దశ ఒప్పందంపై సానుకూల వార్తలు వెలువడటం తదితర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం

Most from this category