ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 55 పాయింట్లు అప్
By Sakshi

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం భారీ లాభంతో ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ శుక్రవారం ముగింపు స్థాయి 11609తో పోలిస్తే 55 పాయింట్లు లాభంతో ఉంది. నిన్న ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి దాదాపు ఫ్లాట్ ముగిశాయి. సెన్సెక్స్ 37.67 పాయింట్ల లాభంతో 39,058.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1.30 పాయింట్ల లాభంతో 11,583.90 వద్ద ముగిసింది. ఈ వారం మొత్తం మీద మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ప్రధానంగా ఇన్ఫోసిస్ కుంభకోణ అంశం మార్కెట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కంపెనీ లాభాలను, మార్జిన్లను ఎక్కువ చేసి చూపించారని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా యుఎస్ సెక్యురిటీ, ఎక్సేంజ్ బోర్డు(యుఎస్ సెక్)కు ఆ కంపెనీ ఉద్యోగుల గ్రూప్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వారం మొత్తం మీద ఇన్ఫోసిస్ 17శాతం నష్టపోయింది. ఇక వారం మొత్తం మీద సెన్సెక్స్ 240 పాయింట్లును కోల్పోగా, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయింది. రేపు దీపావళి సందర్భరంగా ప్రత్యేకమైన ముహురత్ ట్రేడింగ్ జరగునుంది. రాత్రి 6గంటలకు ఆరంభమై, గం.7.15వరకు ట్రేడ్ జరుగుతుంది. వచ్చే వారంలో స్టాక్ మార్కెట్ 4రోజుల మాత్రమే పనిచేస్తుంది. బలిదివస్ సందర్భంగా సోమవారం మార్కెట్‌కు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు.
You may be interested
కొత్త గరిష్టం సమీపంలో అమెరికా మార్కెట్!
Saturday 26th October 2019మూడవ త్రైమాసికానికి సంబంధించి యుఎస్ కార్పోరేట్ ఫలితాలు బాగుండడంతోపాటు, యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందం ఫేజ్1 ఖరారు కానుందనే అంచనాల నేపథ్యంలో గత సెషన్లో యుఎస్ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ జులై 26, 2019 ట్రేడింగ్‌లో ఏర్పరిచిన రికార్డు గరిష్ఠాం 3,027.98 స్థాయికి దగ్గరగా వచ్చి తిరిగి వెనుతిరిగింది. కానీ అప్పటి ట్రేడింగ్‌లో ముగిసిన 3,025.86 స్థాయిని దాటడం గమనార్హం. గత సెషన్లో 3,002.7 వద్ద ప్రారంభమైన
మ్యారికో అమ్మకాలు రూ.1,829 కోట్లు
Saturday 26th October 2019ఒక్కో షేర్‌కు రూ.2.75 మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ కంపెనీ మ్యారికో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 17 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.253 కోట్లకు పెరిగిందని మ్యారికో తెలిపింది. గత క్యూ2లో రూ.1,837 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.1,829 కోట్లకు తగ్గాయని పేర్కొంది. రూ. 1 ముఖ విలువ గల